Covid: ఏపీసీసీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజనాథ్ కి కోవిడ్ పాజిటివ్
ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజనాథ్ కు కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. ఇదే విషయాన్ని ఆయన బుధవారం ఆంధ్ర రత్న భవన్ నుండి విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
- Author : Hashtag U
Date : 19-01-2022 - 12:27 IST
Published By : Hashtagu Telugu Desk
విజయవాడ: ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజనాథ్ కు కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. ఇదే విషయాన్ని ఆయన బుధవారం ఆంధ్ర రత్న భవన్ నుండి విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రస్తుతం హెూమ్ ఐసోలేషన్ లో ఉన్నట్లు తెలిపారు. కోవిడ్ నియమావళిని కచ్చితంగా పాటిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నానని, ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ తనకు వైరస్ సోకిందని, అయితే ఎవరూ అందోళన పడాల్సిన అవసరం లేదని తెలిపారు. ఇటీవల తనను కలిసిన వారు కూడా కొవిడ్ పరీక్షలు తప్పని సరిగా చేయించుకోవాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. తాను ఆరోగ్యంగానే ఉన్నానని, త్వరలోనే అందరికీ అందుబాటులోకి వస్తానని, ప్రతి ఒక్కరు కోవిడ్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, మాస్క్ కచ్చితంగా పెట్టుకోవాలని శైలజనాథ్ సూచించారు.