Haryana AP CM Meeting : ముగిసిన హర్యానా, ఏపీ సీఎంల భేటీ
ఏపీ సీఎం జగన్, హర్యానా సీఎం ఖట్టర్ భేటీ అయ్యారు. ప్రకృతి వైద్యం కోసం రెండు రోజులుగా విశాఖపట్నంలో ఉన్న ఖట్టర్ ను సీఎం జగన్ కలిశారు. విశాఖ పర్యటనలో భాగంగా హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌తో సమావేశం వెనుక శ్రీ శారద పీఠం వ్యవహారం కూడా ఉందని టాక్.
- By CS Rao Published Date - 04:35 PM, Tue - 19 April 22

ఏపీ సీఎం జగన్, హర్యానా సీఎం ఖట్టర్ భేటీ అయ్యారు. ప్రకృతి వైద్యం కోసం రెండు రోజులుగా విశాఖపట్నంలో ఉన్న ఖట్టర్ ను సీఎం జగన్ కలిశారు. విశాఖ పర్యటనలో భాగంగా హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌తో సమావేశం వెనుక శ్రీ శారద పీఠం వ్యవహారం కూడా ఉందని టాక్. ఖట్టర్‌తో భేటీ కోసమే జగన్ మంగళవారం ఉదయం విశాఖ పర్యటనకు వచ్చిన సంగతి తెలిసిందే. విశాఖలో జరిగిన ఇద్దరు సీఎంల భేటీ కాసేపటి క్రితం ముగిసింది. ఖట్టర్‌తో భేటీ ముగించుకున్న జగన్ విజయవాడకు తిరుగు ప్రయాణం అయ్యారు. ప్రకృతి వైద్యం చేయించుకునేందుకు విశాఖ వచ్చిన ఖట్టర్ ప్రస్తుతం విశాఖ పరిధిలోని ఓ ప్రకృతి వైద్య కేంద్రంలో చికిత్స తీసుకుంటున్నారు. ఈ సందర్భంగా తన రాష్ట్రానికి వచ్చిన మరో రాష్ట్ర ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిసేందుకే జగన్ విశాఖ టూర్‌కు వెళ్లారు.