CM Jagan : నేడు హైదరాబాద్ పద్మాలయ స్టూడియోకు ఏపీ సీఎం జగన్
నేడు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి హైదరాబాద్ రానున్నారు. సూపర్ స్టార్ కృష్ణ భౌతికకాయానికి నివాళి అర్పించేందుకే సీఎం...
- By Prasad Published Date - 08:05 AM, Wed - 16 November 22

నేడు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి హైదరాబాద్ రానున్నారు. సూపర్ స్టార్ కృష్ణ భౌతికకాయానికి నివాళి అర్పించేందుకే సీఎం జగన్ హైదరాబాద్ రానున్నారు. నేడు సాయంత్రం జూబ్లీహిల్స్ లోని మహాప్రస్థానంలో కృష్ణ అంత్యక్రియలు జరగనున్నాయి. పద్మాలయ స్టూడియోలో కృష్ణ భౌతికకాయానికి సీఎం జగన్ నివాళ్లు అర్పించనున్నారు. ఈ రోజు సాయంత్రం జూబ్లీహిల్స్ లోని మహాప్రస్థానంలో కృష్ణ అంత్యక్రియలు జరగనున్నాయి. కృష్ణని కడసారి చూసేందుకు పద్మాలయ స్టూడియోకు భారీగా ఆయన అభిమానులు చేరుకుంటున్నారు.