AP Budget: నేటి నుంచి ఏపీ బడ్జెట్ సమావేశాలు
- Author : Hashtag U
Date : 07-03-2022 - 7:56 IST
Published By : Hashtagu Telugu Desk
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నేటి నుంచి ప్రారంభంకానున్నాయి. ఉదయం 11 గంటలకు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించనున్నారు. ఈ సందర్భంగా ఈ రోజు ఉదయం 9:30కు చంద్రబాబు నివాసంలో టీడీపీ నేతలు భేటీ కానున్నారు. ప్రభుత్వ విధానాలకు నిరసన తెలుపుతూ అసెంబ్లీ ప్రాంగణానికి వెళ్లనున్నారు.
అయితే చంద్రబాబు తప్ప మిగిలిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సమావేశాలకు వెళ్లాలని టీడీపీ నిర్ణయించింది. బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం అనంతరం సభ వాయిదా పడనుంది. అనంతరం అసెంబ్లీలో బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో సీఎం, శాసనసభా వ్యవహారాల మంత్రి, టీడీపీ నేత అచ్చెన్నాయుడు పాల్గొననున్నారు. అనంతరం బీఏసీ సమావేశంలో అసెంబ్లీ షెడ్యూల్ ఖరారు చేయనున్నారు. బీఏసీ మీటింగ్ ముగిసిన వెంటనే సచివాలయంలో కేబినెట్ భేటీ అవుతుంది.