Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్‌లో మరో ఎన్‌కౌంటర్..
జమ్మూ కాశ్మీర్‌లో వరసగా ఉగ్రదాడులు, ఎన్‌కౌంటర్లు జరుగుతున్నాయి. ఈ రోజు దోడా జిల్లాలో మరో టెర్రర్ ఎటాక్ కలకలం రేపింది. దోడా జిల్లాలోని కోట టాప్ ప్రాంతంలో ఓ షెడ్డులో ఉగ్రవాదులు దాక్కున్నారనే సమాచారంతో భద్రతా బలగాలు సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి.
- By Praveen Aluthuru Published Date - 11:21 PM, Wed - 12 June 24

Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్‌లో వరసగా ఉగ్రదాడులు, ఎన్‌కౌంటర్లు జరుగుతున్నాయి. ఈ రోజు దోడా జిల్లాలో మరో టెర్రర్ ఎటాక్ కలకలం రేపింది. దోడా జిల్లాలోని కోట టాప్ ప్రాంతంలో ఓ షెడ్డులో ఉగ్రవాదులు దాక్కున్నారనే సమాచారంతో భద్రతా బలగాలు సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి. భద్రతా బలగాలు ధోక్ వైపు వెళుతుండగా, ఉగ్రవాదులు వారిని చూడగానే వారిపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఓ పోలీసు కానిస్టేబుల్ గాయపడ్డారు. ఇతర భద్రతా సిబ్బంది ఎదురు కాల్పులు జరిపారు.
ఈ రోజు రాత్రి 8:20 గంటలకు కోటా టాప్, గండో, దోడాలో భద్రతా బలగాలు మరియు ఉగ్రవాదుల మధ్య ఎన్‌కౌంటర్ ప్రారంభమయింది. SOG గండోహ్‌కు చెందిన కానిస్టేబుల్ ఫరీద్ అహ్మద్ (973/D) కెర్లు భలేసా వద్ద ఆపరేషన్ సమయంలో గాయపడ్డారు. ఎన్‌కౌంటర్ కొనసాగుతోంది. అయితే రియాసీ ఉగ్రదాడి మరువకముందే వరుస ఉగ్రదాడులు ఆందోళన కలిగిస్తున్నాయి.
Also Read: TGSRTC: బస్సు చార్జీలు పెంచట్లేదు, ఫేక్ న్యూస్ నమ్మొద్దు: సజ్జనార్