Railway Board Chairman : రైల్వే బోర్డు చైర్మన్‌గా అనిల్ లహోటీ నియామకం
రైల్వే బోర్డు చైర్మన్‌గా మధ్యప్రదేశ్‌కు చెందిన అనిల్ లహోటి నియమితులయ్యారు. డిసెంబర్ చివరి నాటికి రిటైర్ కానున్న
- Author : Prasad
Date : 26-12-2022 - 8:20 IST
Published By : Hashtagu Telugu Desk
రైల్వే బోర్డు చైర్మన్‌గా మధ్యప్రదేశ్‌కు చెందిన అనిల్ లహోటి నియమితులయ్యారు. డిసెంబర్ చివరి నాటికి రిటైర్ కానున్న సునీత్ శర్మ స్థానంలో లాహోటి బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుతం.. అనిల్ లహోటి రైల్వే బోర్డులోని ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కమిటీ సభ్యునిగా పనిచేస్తున్నారు. అపాయింట్‌మెంట్స్ కమిటీ ఆఫ్ క్యాబినెట్ (ACC) మధ్యప్రదేశ్‌కు చెందిన అనిల్ లహోటీని రైల్వే బోర్డు ఛైర్మన్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO)గా నియమించింది. అనిల్ లాహూటీ నియామకం జనవరి 1, 2023 నుండి అమలులోకి వస్తుంది. అనిల్ లహోటి మధ్యప్రదేశ్‌లోని గుణకు చెందినవారు. ముగ్గురు సోదరుల్లో అనిల్ లాహూటీ అందరికంటే చిన్నవారు. . ఆయన అన్నయ్య ఆర్‌సీ లహోటీ మాజీ భారత ప్రధాన న్యాయమూర్తి (CJI). మరో అన్నయ్య కెకె లాహోటి మధ్యప్రదేశ్ హైకోర్టు జబల్‌పూర్ బెంచ్ నుండి పదవీ విరమణ చేశారు.