Andhra Pradesh: సీఎం జగన్‌ను కలిసిన.. ఏపీ కొత్త డీజీపీ..!
- By HashtagU Desk Published Date - 02:43 PM, Wed - 16 February 22

ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ పై అనూహ్యంగా బదిలీ వేటు వేసిన రాష్ట్ర ప్రభుత్వం, వెంటనే ఆయన స్థానంలో ఇంటెలిజెన్స్ చీఫ్ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డిని ఏపీ కొత్త డీజీపీగా నియమించిన సంగతి తెలిసిందే. గౌతమ్ సవాంగ్ అవుట్, రాజేంద్రనాథ్ రెడ్డి ఇన్ ఒకేరోజు జరిగిపోయాయి. ప్రస్తుతం ఇంటెలిజెన్స్ చీఫ్‌గా ఉన్న రాజేంద్రనాథ్ రెడ్డికి, ఏపీ డీజీపీగా పూర్తి అదనపు బాధ్యతలను అప్పగించిన నేపథ్యంలో బుధవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో, ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు రాజేంద్రనాథ్ రెడ్డి. ఇక 1992 బ్యాచ్‌కు చెందిన రాజేంద్రనాథ్‌రెడ్డి, రెండు తెలుగు రాష్ట్రాల్లో విధులు నిర్వర్తించారు. విశాఖపట్నం, నెల్లూరు, సీఐడీ, రైల్వే ఎస్పీగా పనిచేశారు. విజయవాడ, విశాఖపట్నం పోలీస్ కమిషనర్‌గా కూడా విధులు నిర్వర్తించారు. హైదరాబాద్ వెస్ట్ జోన్, మెరైన్ పోలీస్ విభాగంలో ఉత్తర కోస్తా ఐజీగా రాజేంద్రనాథ్ రెడ్డి విధులు నిర్వర్తిస్తూ, జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు.
సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఇంటెలిజెన్స్ చీఫ్ కసిరెడ్డి వెంకట రాజేంద్రనాథ్ రెడ్డి.
డీజీపీగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించిన నేపధ్యంలో సీఎంతో భేటి. pic.twitter.com/bzULAAOher
— YSR Congress Party (@YSRCParty) February 16, 2022