Anand Mahindra: వైట్ హౌస్ లో స్టేట్ డిన్నర్ పై స్పందించిన ఆనంద్ మహీంద్రా.. వీడియో వైరల్?
మహీంద్రా గ్రూప్ సంస్థలు అధినేత అయిన ఆనంద్ మహీంద్రా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ సోషల్ మీడియా
- By Anshu Published Date - 05:58 PM, Fri - 23 June 23

మహీంద్రా గ్రూప్ సంస్థలు అధినేత అయిన ఆనంద్ మహీంద్రా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ సోషల్ మీడియాలో వైరల్ అయ్యే విషయాలపై తనదైన శైలిలో స్పందిస్తూ ఉంటారు. ఈ మేరకు తాజాగా ఆనంద్ మహీంద్రా వైట్ హౌస్ లో ఏర్పాటు చేసిన స్టేట్ డిన్నర్ గురించి స్పందించారు. ప్రస్తుతం దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమెరికా పర్యటనలో భాగంగా తాజాగా ఆ పర్యటనను ముగించుకున్న విషయం తెలిసిందే. తాజాగా అమెరికా పర్యటనను పురస్కరించుకున్న మోడీ గౌరవార్థం వైట్‌హౌస్‌లో స్టేట్ డిన్నర్‌ను ఏర్పాటు చేశారు.
ఈ డిన్నర్‌కు దాదాపు 400 మంది ప్రముఖులు హాజరయ్యారు. అందులో ఆనంద్ మహీంద్రా కూడా ఉన్నారు. తాజాగా డిన్నర్ ఏర్పాట్లు, అక్కడి ఆతిథ్యం ఎలా ఉంది అన్న విషయాన్ని తెలుపుతూ కొన్ని వీడియోలను ట్విటర్‌లో పోస్టు చేశారు. ప్రస్తుతం ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

White
ఈ సందర్భంగా అందుకు సంబంధించిన వీడియోలను పోస్ట్ చేస్తూ ఈ విధంగా రాసుకొచ్చాడు. ప్రధాని మోదీ గౌరవార్థం వాషింగ్టన్‌లో స్టేట్ డిన్నర్‌కు సంబంధించిన కొన్ని ఫొటోలు, వీడియోలు పంచుకుంటానని మాటిచ్చాను. డిన్నర్‌లో వడ్డించిన వంటకాల విషయం పక్కన పెడితే..
I promised to share some images from the State Dinner in Washington in honour of @PMOIndia at the White House. It was a pleasant surprise to see how the dominant theme of the evening—apart from the cuisine—was music. From the very start to the finish… (1/5) pic.twitter.com/cnNjiE1r6C
— anand mahindra (@anandmahindra) June 23, 2023
అక్కడి సంగీత ప్రదర్శన చూసి నిజంగా ఆశ్చర్యపోయాను అంటూ రాసుకొచ్చారు. అతిథుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మ్యూజికల్ నైట్‌లో ప్రముఖ వయోలినిస్ట్ జోషువా బెల్, దక్షిణ ఆసియాకు చెందిన పెన్ మసాలా గ్రూప్, యూఎస్ మెరైన్‌బాండ్ ఆర్కెస్ట్రా తమ గీతాలతో అలరించారు. వైట్‌హౌస్ లాన్‌లో భారత జాతీయ జెండాలోని త్రివర్ణ రంగులను ఏర్పాటు చేశారు. ప్రతి టేబుల్‌పై ఆకుపచ్చ కాషాయ రంగుల్లో పుష్పాలను భారత జాతీయ పుష్పం కమలాన్ని ఏర్పాటు చేశారు. ఇరు దేశాల జాతీయ పక్షులైన గ్రద్ధ, నెమలి చిత్రాలను ప్రదర్శించారు.