Hiring: ఉద్యోగుల కోసం వినూత్న ప్రకటన… నెట్టింట వైరల్‌గా మారిన పోస్ట్!
ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థలు ఉద్యోగ నియామకాల కోసం పలు రకాల అర్హతలతో నోటిఫికేషన్లు విడుదల చేస్తుంటాయి. ఆయా అర్హతలు తమకు ఉన్నాయో లేదో చూసుకొని అభ్యర్థులు
- By Anshu Published Date - 08:43 PM, Mon - 27 February 23

Hiring: ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థలు ఉద్యోగ నియామకాల కోసం పలు రకాల అర్హతలతో నోటిఫికేషన్లు విడుదల చేస్తుంటాయి. ఆయా అర్హతలు తమకు ఉన్నాయో లేదో చూసుకొని అభ్యర్థులు అప్లై చేసుకుంటూ ఉంటారు. అయితే ఓ కంపెనీ తమ ఔట్‌లెట్ ముందు పెట్టిన ప్రకటనకి అది చూసిన వారంతా అవాక్కవుతున్నారు.
ప్రతి సంస్థ ఉద్యోగ నియామకాలు చేపట్టే సందర్భంలో తమ సంస్థలో పనిచేసే వారికి ఎలాంటి అర్హతలు ఉండాలనేది తెలియజేస్తుంది. దాని ప్రకారం తగిన అర్హతలు కలిగిన అభ్య ర్థులను ఎంపిక చేస్తుంది. కానీ ఓ పిజ్జా కం పెనీ ఉద్యోగ నియామకాలు చేపడుతున్నామని చెప్పేందుకు వినూత్నంగా ప్రయత్నించింది.
పిజ్జేరియా సంస్థ అమెరికాలోని ఒహయో రాష్ట్రంలో శాంటినోస్ పిజ్జేరియా పేరుతో ఓ రెస్టారంట్‌ను నిర్వహిస్తోంది. ఆ రెస్టారెంట్‌లో పని
చేసేందుకు సిబ్బంది కావాలంటూ ఓ ప్రకటన ఏర్పాటు చేసింది. అందులో నౌ హైరింగ్ నాన్-స్టుపిడ్ పీపుల్ అని పేర్కొంది. తెలివైన వారికి మాత్రమే ఉద్యోగం అని చెబుతూ ఆ నోటీసును రెస్టారెంట్ ముందు ఉంచింది.
దీంతో ఆ నోటీసు చూసి అటుగా వెళ్లేవారు ఒకనిమిషం పాటు గందరగోళానికి గురవుతున్నారట. తర్వాత అసలు విషయం అర్థమవడంతో నవ్వుకుంటూ అక్క డి నుంచి వెళ్లిపోతున్నారు. ఈ నోటీసుకు సంబంధించిన ఫొటోను స్టెఫానీ డూప్రే అనే విలేఖరి ట్విటర్‌లో షేర్ చేయడం, అది కాస్తా వైరల్‌గా మారింది. ఈ ఫొటో చూసిన నెటిజన్లు కంపెనీ కొత్తగా ప్రయత్నించిందని కితాబిస్తున్నారు. తెలివైన వారికి మాత్రమే
ఉద్యోగం, తెలివిలేని వారికి ఉద్యోగం లేదని పరోక్షంగా చెప్పిందంటున్నారు. కొంత మంది మాత్రం ఇది చూసి రకరకాలుగా ఆన్లైన్‌లో కామెంట్స్ చేస్తున్నారు.