Amul VS Nadini: కర్ణాటకలో కొత్త పంచాది…అమూల్ వర్సెస్ నందిని
- By hashtagu Published Date - 01:11 PM, Tue - 11 April 23

కర్నాటకలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు షురూ కానున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు కన్నడనాట కొత్త పంచాది మొదలైంది. అమూల్ వర్సెస్ నందిని (Amul VS Nadini) బ్రాండ్ మధ్య పొలిటికల్ వార్ కొనసాగుతుంది. ఆన్ లైన్లో అమూల్ పాలు, పెరుగు అమ్ముతాం. బెంగళూరులో బిజినెస్ ప్రారంభిస్తామంటూ గుజరాత్ కో ఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ చేసిన ట్వీట్ ఇప్పుడు కర్నాటక రాజకీయాల్లో పెను దుమారాన్నే లేపింది. అసెంబ్లీ ఎన్నికల ముందు ఈ పంచాది హాట్ టాపిగ్గా మారింది. అమూల్ చేసిన ప్రకటనను ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. కన్నడ రైతులుందరూ కలిసి కర్నాటక మిల్క్ ఫెడరేషన్ ను ఏర్పాటు చేసుుని నందిని బ్రాండ్ పేరుతో కొత్త బిజినెస్ ప్రారంభించారు. అమూల్ వస్తే కేఎంఎఫ్ పరిస్థితి ఏంటంటూ ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. అమూల్, కేఎంఎఫ్ విలీనంపై కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తుందంటూ బీజేపీ ఎదురుదాడికి దిగింది.
అటు అమూల్ చేసిన ప్రకటనను తీవ్రంగా విమర్శిస్తున్న కాంగ్రెస్, జేడీఎస్ తోపాటు కన్నడ అనుకూల సంఘాలు సోమవారం ఆందోళనకు దిగాయి. కర్నాటకలో రక్షణ వేదికతోపాటు పలు సంఘాల లీడర్లు రోడ్డెక్కారు. దీంతో వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. కర్నాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ హసన్ లోని నందిని మిల్క్ పార్లర్ ను సందర్శించిన కొన్ని ఉత్పత్తులను కొనుగోలు చేసి నందినికి మద్దతు ప్రకటించారు.
ఈ ప్రకటనలో రాష్ట్రంలో పాలఉత్పత్తికి భారీగా తగ్గింది. 90 లక్షల నుంచి 75లక్షల లీటర్లకు పడిపోయింది. నందిని ప్రతిరోజూ ముంబైకి 2.5 లక్షల లీటర్లు, హైదరాబాద్‌కు 1.5 లక్షల లీటర్లు, ఏపీకి మరో బ్యాచ్ పాలను సప్లై చేస్తుండగా…విదేశాలకు కూడా నందిని ఉత్పత్తులు ఎగుమతి చేస్తుంది. మొత్తం అమ్మకాలలో 15 % కర్నాటక బయటే ఉంటాయి. కాగా అమూల్ పాలను ఎవరూ కొనుగోలు చేయోద్దంటూ మాజీ సీఎం సిద్దరామయ్య పిలుపునిచ్చారు. కేఎంఎఫ్, అమూల్ విలీనం అడ్డుకుంటామని ప్రకటించారు.