HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Amravati New Loan Hadco Kfw Project Developments

Amaravati : రాజధాని నిర్మాణానికి త్వరలోనే మరో 16,000 కోట్లు

Amaravati : రాజధాని నిర్మాణానికి మరో 16 వేల కోట్ల రుణం అందనుంది. ఈ మేరకు హడ్కో, జర్మనీ బ్యాంక్‌ కేఎఫ్‌డబ్ల్యూ ముందుకొచ్చాయి.

  • Author : Kavya Krishna Date : 26-11-2024 - 11:11 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Amaravati
Amaravati

Amaravati : అమరావతి రాజధాని నిర్మాణం మరో దశలోకి ప్రవేశిస్తోంది. ఈ ప్రాజెక్టుకు నిధుల కోసం రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ₹16,000 కోట్ల రుణం పొందేందుకు ఏర్పాట్లు చేస్తోంది. హడ్కో , జర్మనీకి చెందిన కేఎఫ్‌డబ్ల్యూ బ్యాంకులు సంయుక్తంగా ఈ రుణం ఇవ్వనున్నాయి. వీటిలో హడ్కో ₹11,000 కోట్లు, కేఎఫ్‌డబ్ల్యూ బ్యాంకు ₹5,000 కోట్లు అందించేందుకు సిద్ధమయ్యాయి. రుణం మంజూరు ప్రక్రియ 15-20 రోజుల్లో పూర్తయ్యే అవకాశం ఉంది. ఈ రుణాలపై సంప్రదింపులు జరిపేందుకు సీఆర్‌డీఏ కమిషనర్ కాటమనేని భాస్కర్‌కు పూర్తి అధికారాలు అప్పగించామని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన సీఆర్‌డీఏ అథారిటీ 40వ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

ప్రపంచ బ్యాంకు, ఏడీబీ సహకారం:
ప్రపంచ బ్యాంకు, ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంకులు కలసి రాజధానికి ఇప్పటికే ₹15,000 కోట్ల రుణం మంజూరు చేయడానికి సిద్ధమయ్యాయి. ఈ ఒప్పందానికి సంబంధించి వచ్చే నెలలో ప్రపంచ బ్యాంకు బోర్డు సమావేశంలో తుది ఆమోదం పొందనుంది. అందులో 25 శాతం నిధులు ఈ నెలాఖరులోగా సీఆర్‌డీఏకు అందుతాయని అధికారులు తెలిపారు.

రాజధాని ఆర్కిటెక్చర్‌కు నార్మన్‌ ఫోస్టర్‌ సంస్థ:
రాజధానిలో నిర్మించనున్న హైకోర్టు, శాసనసభ, సచివాలయం, హెచ్‌ఓడీ కార్యాలయ టవర్ల డిజైన్‌లను లండన్‌కు చెందిన ప్రఖ్యాత నార్మన్‌ ఫోస్టర్‌ అండ్‌ పార్ట్‌నర్స్ సంస్థకు తిరిగి అప్పగించారు. గతంలోనూ ఈ సంస్థే ఈ భవనాల ప్రణాళికను రూపొందించింది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ పనులను నిలిపివేయడంతో ఈ సంస్థ వెనక్కి వెళ్లిపోయింది. తాజాగా టెండర్ ప్రక్రియలో ఎల్‌1గా నిలిచిన ఈ సంస్థ మళ్లీ ఈ ప్రాజెక్టుకు ఎంపికైంది.

టవర్ల నిర్మాణ వ్యయం:
హైకోర్టు, శాసనసభ భవనాల కోసం ₹138 కోట్లు, సచివాలయం, హెచ్‌ఓడీ కార్యాలయాలకు సంబంధించిన ఐదు టవర్లకు మరో ₹138 కోట్లు ఖర్చు చేస్తారని సీఆర్‌డీఏ అధికారులు వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలతో పాటు ప్రభుత్వ రంగ సంస్థల కార్యాలయాలను కూడా ఈ టవర్లలోనే ఏర్పాటు చేయనున్నారు. హడ్కో, కేఎఫ్‌డబ్ల్యూ బ్యాంకుల నుంచి నిధులు సమకూరితే రాజధాని నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేయవచ్చని సీఆర్‌డీఏ ఆశాభావం వ్యక్తం చేస్తోంది.

 
Salicylic Acid : ఇంట్లో సాలిసిలిక్ యాసిడ్ స్కిన్ క్లెన్సర్‌ను ఎలా తయారు చేయాలి..?
 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Amravati
  • andhra pradesh
  • Architecture
  • capital construction
  • CM Chandrababu
  • CRDA
  • government projects
  • Hadco
  • infrastructure
  • KFW Bank
  • loan agreement
  • Norman Foster

Related News

Cbn Speech

Chandrababu : విశాఖ ఫార్మా సిటీ అగ్ని ప్రమాద ఘటనపై సీఎం చంద్రబాబు విచారం

అనకాపల్లి జిల్లా పరవాడలోని ఫార్మా సిటీలోని దక్షిణ్ ఎనర్జీలో జరిగిన అగ్ని ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనలో ఇద్దరు కార్మికుల మృతిపై సీఎం తన సంతాపం తెలియచేశారు. జిల్లా అధికారులతో మాట్లాడి ప్రమాదం జరిగిన తీరుపై సీఎం వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే ఫార్మా సిటీ అగ్నిమాపక కేంద్రం నుంచి రెండు, పరవాడ నుంచి మరొక అగ్న

  • Health Minister

    AP : ఐదు బోధనాసుపత్రుల్లో కృత్రిమ అవయవాల తయారీ యూనిట్లు!

  • CM Chandrababu's Remarks at the 7th Phase Collectors' Conference

    CM Chandrababu : మానవీయ కోణంలో పీజీఆర్ఎస్ అర్జీల పరిష్కారం

  • CM Chandrababu

    CM Chandrababu : సీఎం చంద్ర‌బాబుని క‌లిసిన గాదె సాయికృష్ణ త‌ల్లి

Latest News

  • Hardik Pandya: ఐపీఎల్ లో అతడు ఆడుతాడన్న నమ్మకం లేదు

  • Godrej Agrovet Limited: పత్తి రైతులకు గోద్రెజ్ ఆగ్రోవెట్ గుడ్ న్యూస్

  • Trisha Vijay: రూమర్స్‌కు చెక్.. అర్ధరాత్రి బర్త్‌డే సెలబ్రేషన్‌తో క్లారిటీ ఇచ్చిన త్రిష

  • Sanjay Jaju: తెలంగాణ కొత్త సీఎస్‌గా సంజయ్ జాజు..జూన్ 30న బాధ్యతల స్వీకరణ

  • Telangana Weather Updates: తెలంగాణకు భారీ రెయిన్ అలర్ట్.. ఈ జిల్లాల ప్రజలకు హెచ్చరిక..

Trending News

    • Breaking News: అంతుపట్టని మిస్టరీగా చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు.. రంగంలోకి క్రైమ్ టీం

    • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd