Nellore : వాటర్‌బేస్ కంపెనీలో అమోనియా గ్యాస్ లీక్
Nellore : అర్ధరాత్రి సమయంలో ఫ్యాక్టరీలో ఉన్న అమోనియా గ్యాస్ లీక్ కావడంతో కార్మికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు
- By Sudheer Published Date - 04:11 PM, Sat - 12 April 25

నెల్లూరు జిల్లాలోని టీపిగూడూరు మండలం అనంతపురం గ్రామంలోని వాటర్‌బేస్ కంపెనీ(Waterbase-Company)లో అమోనియా గ్యాస్ లీక్ (Ammonia Gas Leak) ఘటన కలకలం రేపింది. అర్ధరాత్రి సమయంలో ఫ్యాక్టరీలో ఉన్న అమోనియా గ్యాస్ లీక్ కావడంతో కార్మికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. గ్యాస్ వాసనతో శ్వాసతీసుకోవడం కష్టంగా మారటంతో వారు పరుగులు తీశారు.
Mass Jathara : మరోసారి ‘చూపుల్తో గుచ్చి గుచ్చి’ అంటున్న రవితేజ
ఈ ఘటనలో కనీసం 10 మంది కార్మికులు అస్వస్థతకు గురయ్యారని సమాచారం. వారందరిని వెంటనే 108 అంబులెన్సుల్లో నెల్లూరులోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధితుల్లో కొందరికి గుండెల్లో ఒత్తిడి, తలనొప్పి, మితిమేరకు ఉబ్బసం లాంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికి వారంతా చికిత్స పొందుతుండగా, ఎలాంటి ప్రాణాపాయం లేదని అధికారులు తెలిపారు.
గ్యాస్ లీక్ పరిసర గ్రామాలకు కూడా వ్యాపించినట్లు సమాచారం. దీంతో స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో బయటకు వచ్చి మాస్కులు ధరించి రహదారులపైకి వచ్చారు. అప్రమత్తమైన రెవెన్యూ, ఆరోగ్యశాఖలు వెంటనే చర్యలు చేపట్టి, స్థానికులకు జాగ్రత్తలు సూచించాయి. గ్యాస్ లీక్‌కు గల కారణాలపై పరిశీలన కొనసాగుతోందని, కంపెనీ నిర్వహణపై చర్యలు తీసుకునే దిశగా అధికారులు పని చేస్తున్నారని సమాచారం.