Mass Jathara : మరోసారి ‘చూపుల్తో గుచ్చి గుచ్చి’ అంటున్న రవితేజ
Mass Jathara : 'మాస్ జాతర' నుంచి తూ మేరా లవర్ సాంగ్ ప్రోమో విడుదలైంది
- Author : Sudheer
Date : 12-04-2025 - 3:53 IST
Published By : Hashtagu Telugu Desk
మాస్ మహారాజా రవితేజ (Raviteja) మరోసారి తన స్టైల్‌కి తగ్గ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. గతేడాది విడుదలైన ‘ఈగల్’, ‘మిస్టర్ బచ్చన్’ సినిమాలు పెద్దగా ఆకట్టుకోకపోవడంతో.. రవితేజకు ఇప్పుడు ఒక భారీ హిట్ అవసరం. తన స్టైల్, ఎనర్జీకి తగిన పాత్రలో నటించాలనే ఆలోచనలో భాగంగా ‘సామజవరగమన’ రచయిత భాను భోగవరపు (Bhanu Bogavarapu) దర్శకత్వంలో ‘మాస్ జాతర’ (Mass Jathara) అనే మూవీ చేస్తున్నాడు. టైటిల్ కు తగ్గట్లు రవితేజ మార్క్ మాస్ ఎంటర్‌టైనర్ అనే విషయం స్పష్టమవుతోంది. ఇందులో రవితేజ తనకు బాగా కలిసొచ్చిన పోలీస్ పాత్రలో నటిస్తుండటంతో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
LunaRecycle Challenge: చందమామపై మానవ వ్యర్థాలు.. ఐడియా ఇచ్చుకో.. 25 కోట్లు పుచ్చుకో
రవితేజ, శ్రీలీల ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న ‘మాస్ జాతర’ నుంచి తూ మేరా లవర్ సాంగ్ ప్రోమో విడుదలైంది. భీమ్స్ మ్యూజిక్ అందిస్తోండగా పాటలో ఇడియట్ మూవీలోని ‘చూపుల్తో గుచ్చి గుచ్చి’ మ్యూజిక్ బీట్ను యాడ్ చేశారు. పాత స్టెప్పులను మాస్ రాజా రీక్రియేట్ చేశారు. ఫుల్ సాంగ్ ఎల్లుండి రిలీజ్ కానుంది. పూరి డైరెక్షన్లో వచ్చిన ఇడియట్ మూవీ ఎంత పెద్ద విజయం సాధించిందో తెలియంది కాదు..ఈరోజు రవితేజ ఈ స్టేజ్ లో ఉన్నాడంటే దానికి కారణం ఇడియట్ మూవీ. ఈ మూవీ లో ‘చూపుల్తో గుచ్చి గుచ్చి’ అనే సాంగ్ యూత్ ను బాగా ఆకట్టుకుంది. ఇప్పటికి ఈ సాంగ్ వినిపిస్తూనే ఉంటుంది. అలాంటి ఈ పాట ఇప్పుడు మరోసారి థియేటర్స్ లలో వినిపించపోతుండడం తో అభిమానులు ఆ సాంగ్ ను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఎదురుచూస్తున్నారు.