Amit Shah: లోక్ సభలో నవ్వులు పూయించిన అమిత్ షా
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా లోక్ సభలో నవ్వుల పువ్వులు పూయించారు. తనపై తానే సెటైర్ వేసుకున్నారు.
- Author : Hashtag U
Date : 05-04-2022 - 4:49 IST
Published By : Hashtagu Telugu Desk
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా లోక్ సభలో నవ్వుల పువ్వులు పూయించారు. తనపై తానే సెటైర్ వేసుకున్నారు. దీంతో సభలో నవ్వులు పూయించారు. తన స్వరం గంభీరంగా ఉంటుందని.. గట్టిగా మాట్లాడానంటే..కోపంగా ఉన్నట్లు కాదని, కశ్మీర్ కు సంబంధించిన ప్రశ్నలు అడిగినప్పుడు మినహా తనకెప్పుడూ కోపం రాదన్నారు. నేనెప్పుడూ ఎవర్నీ తిట్టలేదని.. తన స్వరం కొంచెం పెద్దగా ఉందనీ.. అది తయారీలోపం అనగానే.. ఒక్కసారిగా సభలో నవ్వులు వెల్లివిరిసాయి. అమిత్ షా వ్యాఖ్యలతో సభలో ఉన్న సభ్యుల్లో కొందరు చిరునవ్వులు చిందించారు. మరికొందరు గట్టిగా నవ్వేశారు.
పార్లమెంట్ రెండో విడత బడ్జెట్ సమావేశాల చివరివారంలో భాగంగా క్రిమినల్ ప్రొసిజర్ ఐడెంటిఫికేషన్ బిల్ 2022ను అమిత్ షా సభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్బంగా తన గొంతుపై సెటైర్ వేసుకున్నారు. నేర పరిశోధనను మరింత సమర్థవంతంగా వేగవంతం చేయడం, నేరారోపణ రేటును పెంచడం క్రిమినల్ ప్రొసీజర్ ఐడెంటిఫికేషన్ బిల్లు లక్ష్యమన్నారు. అందుకే బిల్లును ప్రవేశపెడుతున్నామని చెప్పారు.