Cyclone Biparjoy: బిపార్జోయ్ ప్రభావిత ప్రాంతాల్లో షా పర్యటన
బిపార్జోయ్ తుఫాను అలజడి సృష్టిస్తుంది. ప్రస్తుతం బిపార్జోయ్ తుఫాను గుజరాత్ లో తీవ్రంగా మారింది. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర అధికార యంత్రాంగం సహాయక చర్యలు చేపట్టింది.
- Author : Praveen Aluthuru
Date : 17-06-2023 - 5:39 IST
Published By : Hashtagu Telugu Desk
Cyclone Biparjoy: బిపార్జోయ్ తుఫాను అలజడి సృష్టిస్తుంది. ప్రస్తుతం బిపార్జోయ్ తుఫాను గుజరాత్ లో తీవ్రంగా మారింది. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర అధికార యంత్రాంగం సహాయక చర్యలు చేపట్టింది. ముంపు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ సమయంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా గుజరాత్ లో పర్యటించారు.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా, గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌తో కలిసి శనివారం గుజరాత్‌లోని కచ్‌లో బిపార్జోయ్ తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు. సీఎం పటేల్, ఇతర ఉన్నతాధికారులతో అమిత్ షా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇదే సమయంలో అమిత్ షా మాండ్వి సివిల్ ఆసుపత్రిని సందర్శించి అక్కడ ప్రజలను కలుసుకుని పరామర్శించారు. అనంతరం తుఫాను ప్రభావిత ప్రజలను కలుసుకున్నారు. ఆపై భుజ్‌లోని స్వామినారాయణ ఆలయాన్ని సందర్శించి బాధిత ప్రజలకు అందిస్తున్న ఆహారం మరియు ఇతర సౌకర్యాలను సమీక్షిస్తారు.
Gujarat | Union Home Minister Amit Shah visited Mandvi Civil Hospital and met the people admitted there. pic.twitter.com/JLVbovreQd
— ANI (@ANI) June 17, 2023
తుఫాను ప్రభావిత ప్రాంతాలను పరిశీలించిన తర్వాత హోంమంత్రి అమిత్ షా SDRF మరియు NDRF సిబ్బందితో సమావేశమయ్యారు. బిపార్‌జోయ్ తుఫాను సమయంలో ప్రజలను రక్షించడానికి సహాయక బృందాలు తీవ్రంగా ప్రయత్నించిందని షా తెలిపారు. ఈ విధ్వంసం సమయంలో రెస్క్యూ వర్కర్లు చాలా చురుకుగా ఉన్నారని కొనియాడారు.
Read More: Telangana University VC: ఏసీబీ వలలో చిక్కిన తెలంగాణ వర్సిటీ వైస్ ఛాన్సలర్