Delhi Rape: అమెరికా వృద్ధురాలిపై 35 ఏళ్ళ టూరిస్ట్ గైడ్ అత్యాచారం
దేశ రాజధాని ఢిల్లీలోని వివేక్ విహార్ ప్రాంతంలో దారుణం వెలుగు చూసింది. అమెరికాలో ఉంటున్న ఓ వృద్ధురాలిపై అత్యాచారం ఘటన చోటుచేసుకుంది.
- Author : Praveen Aluthuru
Date : 08-05-2023 - 11:02 IST
Published By : Hashtagu Telugu Desk
Delhi Rape: దేశ రాజధాని ఢిల్లీలోని వివేక్ విహార్ ప్రాంతంలో దారుణం వెలుగు చూసింది. అమెరికాలో ఉంటున్న ఓ వృద్ధురాలిపై అత్యాచారం ఘటన చోటుచేసుకుంది. ఈ కేసులో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి 35 ఏళ్ల నిందితుడిని అరెస్టు చేశారు స్థానిక పోలీసులు
తూర్పు ఢిల్లీలోని వివేక్ విహార్ ప్రాంతంలో 62 ఏళ్ల అమెరికా మహిళపై అత్యాచారం చేసిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. టూరిస్ట్ గైడ్ ఈ ఘటనకు పాల్పడ్డాడని ఆరోపించారు. బాధితురాలి ఫిర్యాదుపై వివేక్ విహార్ పోలీస్ స్టేషన్ ఎఫ్ఐఆర్ నమోదు చేసి 35 ఏళ్ల నిందితుడిని అరెస్టు చేసింది.
బాధితురాలు 2019 నుంచి 2022 మధ్య చాలాసార్లు భారత్‌కు వచ్చినట్లు పోలీసులు తెలిపారు. ఆమె ఇండియా వచ్చినప్పుడల్లా ఒకే గైడ్‌ని బుక్ చేసేవారు. క్రమంగా సదరు మహిళకు, టూరిస్ట్ గైడ్ ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. పెళ్లి సాకుతో ఆగ్రాలో, ఆ తర్వాత ఢిల్లీలో ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు.
Read More: Aiswarya Lakshmi : పింక్ అవుట్ ఫిట్ లో సూపర్ ఫిగర్ గా కనిపిస్తున్న ఐశ్వర్య లక్ష్మి