Allu Arjun : ‘మామ’ కోసం అల్లు అర్జున్ పొలిటికల్ ఎంట్రీ..?
సినీ గ్లామర్ ను తమ ప్రచారానికి వాడుకోవాలని రాజకీయ నేతలు చూస్తున్నారు
- By Sudheer Published Date - 07:37 PM, Fri - 11 August 23

ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల హడావిడి మొదలైంది. మరో నాల్గు , ఐదు నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయి. దీంతో అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికలకు సిద్ధం అవుతున్నాయి. ఇప్పటికే పలు పార్టీలు తమ అభ్యర్థుల లిస్ట్ ను రెడీ చేయగా..మరికొన్ని పార్టీలు నేతల లిస్ట్ ను సిద్ధం చేసేపనిలో ఉన్నాయి. ఇదే క్రమంలో సినీ గ్లామర్ ను తమ ప్రచారానికి వాడుకోవాలని రాజకీయ నేతలు చూస్తున్నారు. గతంలో కూడా పలు పార్టీల ప్రచారానికి సినీ తారలు వచ్చి ప్రచారం చేసిన సంగతి తెలిసిందే.
ఇక ఈసారి అలాగే చేయబోతున్నారు. ఈ క్రమంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun ) తన మామ కోసం రంగంలోకి దిగబోతున్నట్లు తెలుస్తుంది. ఎన్నికల్లో మామ కోసం ప్రచారం చేయబోతున్నారట. అయితే ఇక్కడ మామ అంటే పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) గురించి కాదు..తనకు పిల్లనిచ్చిన మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి (Kancharla Chandrasekhar Reddy) కోసం రాజకీయ ప్రచారం చేయబోతున్నారట. ఇప్పటికే కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి కి నాగార్జున సాగర్ (Nagarjuna Sagar Assembly constituency) టికెట్ కన్ఫార్మ్ చేశారట. అందుకే ఇప్పటి నుండే నియోజకవర్గంలో ప్రచారం మొదలుపెట్టారు చంద్రశేఖర్ రెడ్డి. అందులో భాగంగానే.. నియోజకవర్గంలో అల్లుఅర్జున్‌తో ఇప్పటి నుంచే ప్రచారం చేపించేందుకు ముహూర్తం కూడా ఫిక్స్ చేశారట.
ఈ నెల 19న కంచర్ల చంద్రశేఖర్ రెడ్డితో పాటు అల్లు అర్జున్ నాగార్జున సాగర్ నియోజకవర్గంలో పర్యటించున్నట్టు సమాచారం. నిజంగా అల్లు అర్జున్ ప్రచారం చేస్తే చంద్రశేఖర్ కి మాత్రమే కాదు పార్టీ కి కూడా చాల ప్లేస్ అవుతుందని బిఆర్ఎస్ భవిస్తుందట. ఇక అల్లు అర్జున్ విషయానికి వస్తే ..ప్రస్తుతం పుష్ప 2 షూటింగ్ లో బిజీ గా ఉన్నారు.
Read Also : Rushikonda : ఉత్తరాంధ్ర భూములు, ఆస్తులపై వైసీపీ నేతల కళ్లు పడ్డాయి – పవన్ కళ్యాణ్