Hyderabad: జూబ్లీహిల్స్ నుంచి ఎంఐఎం పోటీ.. అభ్యర్థి ఎవరో తెలుసా?
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఎంఐఎం తమ అభ్యర్థుల్ని ఖరారు చేస్తుంది. ఇప్పటికే ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టిన ఆ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసి తాజాగా జూబ్లీహిల్స్ అభ్యర్థిని ప్రకటించారు.
- By Praveen Aluthuru Published Date - 03:11 PM, Mon - 6 November 23

Hyderabad: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఎంఐఎం తమ అభ్యర్థుల్ని ఖరారు చేస్తుంది. ఇప్పటికే ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టిన ఆ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసి తాజాగా జూబ్లీహిల్స్ అభ్యర్థిని ప్రకటించారు. షేక్‌పేట కార్పొరేటర్ మహమ్మద్ రషీద్ ఫరాజుద్దీన్‌కు ఆ నియోజకవర్గం టికెట్ కేటాయించారు. దీంతో జూబ్లీహిల్స్ నుంచి రషీద్ అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగనున్నారు. బీఆర్ఎస్ నుంచి మాగంటి గోపినాథ్ బరిలోకి దిగుతుండగా, కాంగ్రెస్ నుంచి ప్రముఖ క్రికెటర్ అజారుద్దీన్ పోటీలో ఉన్నారు. బీజేపీ నుంచి దీపక్ రెడ్డి బరిలో ఉన్నారు. అయితే జూబ్లీహిల్స్ నుంచి గోపినాథ్ వరుసగా గెలుస్తూ వస్తున్నారు. మరి ఈ సారి ఆ నియోజకవర్గం నుంచి ఎవరు విజయం సాధిస్తారో చూడాలి. కాగా ఆ నియోజవర్గంలో అత్యధికంగా ముస్లిం ఓటర్లు ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఎంఐఎం తమ అభ్యర్థిని నిలబెట్టినట్టు తెలుస్తుంది.
Also Read: world cup 2023: సెమీస్ కోసం లంక పోరాటం: శ్రీలంక – బంగ్లాదేశ్ హెడ్ టూ హెడ్ రికార్డ్స్