AP Govt : గత ప్రభుత్వ 40 మంది సలహాదారులను తొలగించిన బాబు..
గత ప్రభుత్వంలో సలహాదారులుగా ఉన్న 40 మందిని తొలగించారు. నిన్న సజ్జలతో పాటు 20 మంది సలహాదారులు తమ పదవులకు రాజీనామా చేశారు. .చేయని వారిని తాజాగా ప్రభుత్వం తొలగించింది
- By Sudheer Published Date - 08:36 PM, Thu - 6 June 24

ఏపీలో విజయం సాధించిన కూటమి..ఇప్పుడు కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ఈ నెల 12 న సీఎం గా ప్రమాణ స్వీకారం చేయబోతున్న చంద్రబాబు..అధికారం చేపట్టేలోపే గత ప్రభుత్వంలో పనిచేసిన అధికారుల ఫై వేటు వేస్తూ వస్తున్నాడు. ఇప్పటికే పలు శాఖల్లోని అధికారులను మార్చేందుకు డిసైడ్ అయినా బాబు..తాజాగా గత ప్రభుత్వంలో సలహాదారులుగా ఉన్న 40 మందిని తొలగించారు. నిన్న సజ్జలతో పాటు 20 మంది సలహాదారులు తమ పదవులకు రాజీనామా చేశారు. చేయని వారిని తాజాగా ప్రభుత్వం తొలగించింది. ఇంకా 40 మంది పైగా సలహాదారులు ఉన్నట్టు గుర్తించిన సర్కార్.. ఈ రెండు రోజుల్లో వారిపై కూడా వేటు వేసే అవకాశం ఉంది.
We’re now on WhatsApp. Click to Join.
తాజా ఎన్నికల్లో జగన్ ఓటమికి సలహాదారులు కూడా ఒక కారణమనే చర్చ జరుగుతోంది. అలాంటి సలహాదారులను తాజాగా ప్రభుత్వం తొలగించింది. అధికారంలో ఉన్న సమయంలో సలహాదారులు అవినీతి అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలు వినిపించాయి. టీడీపీ కూడా సలహాదారులపై తీవ్ర విమర్శలు చేసింది. అధికారంలో ఉన్న సమయంలో సలహాదారులు తమ ఇష్టారాజ్యంగా వ్యవహరించారని.. ప్రభుత్వ సొమ్మును నొక్కేశారనే ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం వారిని తొలగించినా భవిష్యత్‌లో వారి అవినీతి బాగోతాలు బయటకు తీసి వారిపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం లేకపోలేదు.
Read Also : Blue Media : జగన్ మీడియా పూర్తిగా విఫలమైంది..!