Yadadri Bhuvangiri: కల్తీ పాలు విక్రయిస్తున్న వ్యక్తి అరెస్టు
యాదాద్రి భువనగిరి జిల్లా కల్తీ పాలను తయారు చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. భువనగిరి జిల్లాభూదాన్ పోచంపల్లి మండలం కనుముక్కల గ్రామంలో కల్తీ పాలను తయారు చేస్తున్న వలిగొండ పాండు అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.
- By Praveen Aluthuru Published Date - 05:21 PM, Sun - 17 December 23
Yadadri Bhuvangiri: దేశంలో కల్తీపాల వ్యాపారం యథేచ్ఛగా సాగుతుంది. పలు రాష్ట్రాల్లో కల్తీ రాయుళ్లు పాల వ్యాపారాన్ని ఎంచుకుని లక్షలు సంపాదిస్తున్నారు. ఇక హైదరాబాద్ చుట్టుప్రక్కల ప్రాంతాల్లో పాల కల్తీ వ్యాపారం రోజురోజుకు విస్తరిస్తుంది. యాదాద్రి భువనగిరి జిల్లా కల్తీ పాలను తయారు చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.
భువనగిరి జిల్లాభూదాన్ పోచంపల్లి మండలం కనుముక్కల గ్రామంలో కల్తీ పాలను తయారు చేస్తున్న వలిగొండ పాండు అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి 150 లీటర్ల కల్తీ పాలు, 2 లీటర్ల హైడ్రోజన్ పెరాక్సైడ్, 8 ప్యాకెట్ల డోలోఫర్ స్కిమ్డ్ మిల్క్ స్వాధీనం చేసుకున్నారు. భూదాన్ పోచంపల్లి మండలం గౌస్ కొండ గ్రామంలో కల్తీ పాల వ్యాపారం చేస్తున్న అస్గర్ అనే వ్యక్తిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి 200 లీటర్ల కల్తీ పాలు, 100 ఎంఎల్ హైడ్రోజన్ పెరాక్సైడ్, 3 డోలోఫర్ స్కిమ్డ్ మిల్క్ ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు
Also Read: Medaram Special Buses : మేడారానికి ప్రత్యేక బస్సు సర్వీసులు ప్రారంభం