Acupuncture Therapy for Diabetes: ఆక్యుపంక్చర్ మధుమేహాన్ని దూరం చేస్తుందా?
ప్రస్తుత రోజుల్లో ఎక్కువ శాతం మందిని వేధిస్తున్న సమస్య మధుమేహం. చిన్న పెద్ద అనే వయసు తేడా లేకుండా ప్రతి
- By Nakshatra Published Date - 06:30 AM, Fri - 5 August 22

ప్రస్తుత రోజుల్లో ఎక్కువ శాతం మందిని వేధిస్తున్న సమస్య మధుమేహం. చిన్న, పెద్ద అనే వయసు తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఈ మధుమేహ సమస్యతో బాధపడుతున్నారు. ఇదిలా ఉంటే టైప్ టూ డయాబెటిస్ ను నివారించడంలో ఆక్యుపంక్చర్ తెరఫీ ఉపయోగకరమైన సాధనం అని ఎడిత్ కోవాన్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు చెప్తున్నారు.
ఈ అధ్యయనం కోసం పరిశోధనా బృందం 3,600 మంది డయాబెటీస్ బాధితులపై పరిశోధన చేసింది. పరిశోధన చేసిన తర్వాత మధుమేహగ్రస్తుల్లో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవని.. మంచి రిజల్ట్ వచ్చిందని పరిశోధకులు తెలిపారు. ఇదే విషయంపై ప్రధాన పరిశోధకుడు మిన్ జాంగ్ మాట్లాడుతూ, ఇది మధుమేహం నుండి బయటపడటానికి ఆక్యుపంక్చర్ థెరపీ మంచిదని తెలిపారు.
అలాగే ప్రపంచం జనాభాలోని 11 శాతం మందిపై ఈ థెరపి ప్రభావితం చేస్తుందని మిన్ జాంగ్ చెప్పుకోచ్చారు. అయితే మధుమేహం ప్రమేయం లేకుండా, ప్రీడయాబెటిస్ ఉన్నవారిలో 93 శాతం మంది 20 సంవత్సరాలలో టైప్ 2 డయాబెటిస్ బారిన పడే అవకాశం ఉందని మిన్ జంగ్ తెలిపారు. ఆహారపు అలవాట్లలో మార్పులు, వ్యాయామం వంటి జీవినశైలితో ఈ డయాభేటీస్ ని నియంత్రించవచ్చని పరిశోధకులు చెప్తున్నారు. డయాబెటిస్ ఎక్కువ స్ట్రెస్ ఉన్నవారికి కూడా వస్తుందని చెప్తున్నారు. అలాగే నిద్ర సమస్యలు, అధిక రక్తపోటు కూడా డయాభేటీస్ రావడానికి కారణం అని చెప్పారు.
Related News

Diabetes : ఈ చర్మవ్యాధులన్నీ మధుమేహం ఉన్నవారికే ఎందుకు వస్తాయి…వైద్యులు ఏమంటున్నారు..?
శరీరంలో షుగర్ లెవల్స్ సరిగా కంట్రోల్ కాకపోతే మధుమేహానికి దారి తీస్తుంది. ఒక్కసారి మధుమేహం వస్తే అది తగ్గదు. ఈ మధుమేహం వల్ల అనేక చర్మ సంబంధిత సమస్యలు వస్తాయి.