Actor Vijay: తెలంగాణ సీఎంతో…తమిళ స్టార్ హీరో విజయ్ భేటీ..!!
తెలంగాణ సీఎం కేసీఆర్ తో తమిళ హీరో విజయ్ భేటీ అయ్యారు.
- By Hashtag U Published Date - 10:19 PM, Wed - 18 May 22

తెలంగాణ సీఎం కేసీఆర్ తో తమిళ హీరో విజయ్ భేటీ అయ్యారు. హైదరాబాద్ వచ్చిన విజయ్…ప్రగతి భవన్ కు వెళ్లి కేసీఆర్ ను కలిశారు. విజయ్ ను సాదరంగా ఆహ్వానించిన కేసీఆర్…ఆయన్ను ఘనంగా సన్మానించారు.
అయితే ఈ భేటీ ఏ అంశం ప్రాతిపదికగా జరిగిందన్న సమాచారం లేదు. ఏదైనా ప్రత్యేక అంశంపై చర్చించేందుకే విజయ్ ప్రగతి భవన్ కు వెళ్లారా లేదంటే..హైదరాబాద్ వచ్చిన నేపథ్యంలో కేసీఆర్ ను మర్యాదపూర్వకంగా కలిశారా అనే అంశంపై స్పష్టత లేదు.
ప్రగతి భవన్ కు వచ్చిన విజయ్ ను టీఆరెస్ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ ఘనంగా స్వాగతం పలికారు. విజయ్ వెంట దర్శకుడు వంశీ పైడిపల్లి కూడా ప్రగతి భవన్ కు వచ్చారు.
తమిళ సినీ హీరో @actorvijay ఈ రోజు ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావును మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా విజయ్ ని సీఎం శాలువాతో సన్మానించారు. pic.twitter.com/BsPqiCwDaV
— Telangana CMO (@TelanganaCMO) May 18, 2022