Actor Mohan Babu: కాంటినెంటల్ హాస్పిటల్ లో చికిత్స అనంతరం డిశ్చార్జ్ అయినా నటుడు మోహన్ బాబు
నటుడు మోహన్‌బాబు గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.
- By Kode Mohan Sai Published Date - 04:35 PM, Thu - 12 December 24

సినీనటుడు మోహన్‌బాబు గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. గత మంగళవారం రాత్రి జల్‌పల్లి వద్ద ఆయన నివాసంలో జరిగిన ఘర్షణ అనంతరం మోహన్‌బాబుకు శరీరంలో అధికంగా నొప్పులు, ఆందోళన ఉండటంతో ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. వైద్యులు పరీక్షలు నిర్వహించి, ఆయన కంటి దిగువభాగంలో గాయాలు ఉన్నాయని గుర్తించారు. అదేవిధంగా, ఆయనకు బీపీ కూడా అధికంగా ఉన్నట్లు, గుండె కొట్టుకోవడంలో కూడా కొంత హెచ్చుతగ్గులు ఉన్నట్లు తెలిపారు.
రెండ్రోజుల చికిత్స తర్వాత, గురువారం మధ్యాహ్నం మోహన్‌బాబు డిశ్చార్జ్ అయ్యారు. అంతేకాక, ఆయన నివాసంలో జరిగిన ఘర్షణపై విచారణకు హాజరయ్యేలా రాచకొండ సీపీ సుధీర్‌బాబు నోటీసులు జారీ చేశారు. అయితే, ఈ విషయంపై మోహన్‌బాబు హైకోర్టును వరియించిన విషయం తెలిసిందే. అయితే, కోర్టు ఈనెల 24 వరకు ఈ విచారణపై స్టే ఇచ్చింది.