Balakrishna:నిమ్మకూరులో బాలయ్య సందడి.. తారకరాముడికి నివాళ్లు అర్పించిన బాలకృష్ణ
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి, స్వర్గీయ డాక్టర్ నందమూరి తారకరామారావు శతజయంతి వేడుకల సందర్భంగా కృష్ణా జిల్లా నిమ్మకూరులో సందడి వాతావరణం నెలకొంది.
- Author : Hashtag U
Date : 28-05-2022 - 1:24 IST
Published By : Hashtagu Telugu Desk
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి, స్వర్గీయ డాక్టర్ నందమూరి తారకరామారావు శతజయంతి వేడుకల సందర్భంగా కృష్ణా జిల్లా నిమ్మకూరులో సందడి వాతావరణం నెలకొంది. శతజయంతి ఉత్సవాల్లో పాల్గొనేందుకు హిందూపురం ఎమ్మెల్యే, నటుడు నందమూరి బాలకృష్ణ నిమ్మకూరు వచ్చారు. నిమ్మకూరులో ఎన్టీఆర్, బసవతారక విగ్రహాలకు పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం వెంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఎన్టీఆర్ ఆశీస్సులు తెలుగు రాష్ట్రాలపై ఎప్పటికీ ఉంటాయని బాలకృష్ణ తెలిపారు.తెలుగువారి గుండెల్లో ఆయన చిరస్థాయిగా నిలిచిపోతారని.. మళ్లీ జన్మంటూ ఉంటే తెలుగువాడిగానే పుట్టాలన్న ఆయనకు వందనాలని బాలకృష్ణ పేర్కొన్నారు.