HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Accident Survivor Waits 25 Days At Gandhi Hospital For Surgery

Gandhi Hospital: బాలికకు శస్త్ర చికిత్సలో 25 రోజుల జాప్యం!

హైదరాబాద్ లోని గాంధీ ఆస్పత్రిలో అత్యవసర వైద్య సేవల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

  • Author : Hashtag U Date : 27-04-2022 - 2:16 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
gandhi hospital
gandhi hospital

హైదరాబాద్ లోని గాంధీ ఆస్పత్రిలో అత్యవసర వైద్య సేవల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రోడ్డు ప్రమాదం లో తల్లిదండ్రులను కోల్పోయి..తృటిలో ప్రాణాలతో బయటపడిన 14 ఏళ్ల బాలిక అక్షయకు న్యూరో సర్జరీ చేయడంలో వైద్యులు తీవ్ర జాప్యం చేశారు. వెన్నెముక కు తీవ్ర గాయాలతో మార్చి 31న గాంధీ లో చేరిన బాలికకు ఏప్రిల్ 26న సర్జరీ చేశారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే ఇంత ఆలస్యంగా శస్త్రచికిత్స జరిగిందని బాలిక బంధువులు ఆరోపిస్తున్నారు. వాస్తవానికి ఏప్రిల్ 15న ఆమెకు సర్జరీ చేస్తామంటూ న్యూరో సర్జరీ వార్డుకు తీసుకెళ్లారు.

అయితే ఆమెకు జ్వరంగా ఉందని గుర్తించామంటూ వైద్యులు సర్జరీని వాయిదా వేశారు. రెండు, మూడు రోజులకు మరోసారి సర్జరీకి డేట్ ను ఫిక్స్ చేసినప్పటికీ.. తగిన సైజున్న సర్జికల్ స్క్రూ లు లేవంటూ ఇంకో దఫా కూడా వాయిదా వేశారు. ఎట్టకేలకు అక్షయ ఆస్పత్రిలో చేరిన 25 రోజుల తర్వాత ఈనెల 25న రాత్రి సర్జికల్ స్క్రూలు సిద్ధమయ్యాయి. దీంతో 26న ఉదయం శస్త్ర చికిత్స నిర్వహించారు. ప్రస్తుతం అక్షయ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. కాగా, గాంధీ ఆస్పత్రిలో గత రెండున్నర ఏళ్లుగా MRI మెషీన్ లేదని వైద్యులు తెలిపారు.అక్షయ కు సంబంధించిన MRI స్కానింగ్ ను పూర్తి చేసి, రిపోర్టును ఇవ్వడానికి ఇతర ఆస్పత్రులు దాదాపు ఐదు రోజుల సమయం తీసుకున్నాయని, సర్జరీ చేయడంలో జాప్యానికి అదే ప్రధాన కారణమని చెప్పారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Gandhi hospital
  • hyderabad
  • road accident
  • treatment

Related News

' The February Edit

‘ The February Edit ‘ : ఇనార్బిట్ మాల్ లో ‘ది ఫిబ్రవరి ఎడిట్’ ఉత్సవం

ప్రముఖ ప్లేబ్యాక్ సింగర్ దామిని (బాహుబలి చిత్ర ఫేమ్) ఆధ్వర్యంలో లైవ్ మ్యూజిక్ కన్సర్ట్‌లను మాల్ నిర్వహిస్తోంది. ఫిబ్రవరి 14, 21 మరియు 22 తేదీల్లో జరిగే ఈ ప్రదర్శనల్లో జాజ్, ఆర్&బి, నియో-సోల్ మరియు సినిమాటిక్ పాప్ వంటి వివిధ సంగీత శైలులను మిళితం చేసి శ్రోతలను అలరిస్తున్నారు

  • Tal Health Fest 2026

    TAL Health Fest 2026: ఆరోగ్య సంరక్షణలో సరికొత్త విప్లవం

  • Light A Lamp For God

    Fire Accident : దేవుడికి దీపం పెట్టడమే వారు చేసిన పాపమా ?

  • Hyderabad Land Rent

    హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఇళ్లు,ఫ్లాట్ల ధరలు

  • Purepower

    PuREPower : హైదరాబాద్‌లో నూతన షోరూమ్ ప్రారంభం

Latest News

  • ఐసీసీ టీ20 వరల్డ్ కప్.. ఆస్ట్రేలియా ఇంటికేనా?!

  • ఫిబ్ర‌వ‌రి 26న విజ‌య్‌- ర‌ష్మిక పెళ్లి?!

  • భారత్ చేతిలో ఓటమి.. పాకిస్థాన్‌లో ముదురుతున్న వివాదం, ప్రమాదంలో మొహ్సిన్ నఖ్వీ పదవి!

  • స్వదేశానికి చేరుకున్న టీమ్ ఇండియా.. తదుపరి లక్ష్యం నెదర్లాండ్స్‌తో పోరు!!

  • ప్ర‌పంచంలో అత్యంత భ‌యంక‌ర‌మైన క్యాన్స‌ర్ ఏదంటే?!

Trending News

    • టీ20 వరల్డ్ కప్ 2026.. పాకిస్థాన్‌తో సహా ఈ 5 జ‌ట్లు క‌ష్ట‌మే!

    • బంగారం ధ‌ర ప‌డిపోనుందా? విశ్లేష‌కులు ఏం చెబుతున్నారంటే?

    • భార‌త్‌- పాక్ మ‌ధ్య మ‌రోసారి మ్యాచ్ జ‌ర‌గ‌నుందా?

    • మహాశివరాత్రి.. జాగరణ చేస్తున్నారా?

    • కోహ్లీ రికార్డుల క్లబ్‌లోకి ఇషాన్ కిష‌న్‌..!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd