TS: కేసీఆర్ వరంగల్ టూర్ లో ఘోర ప్రమాదం..!!
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వరంగల్ పర్యటనలో ప్రమాదం చోటుచేసుకుంది.
- Author : hashtagu
Date : 01-10-2022 - 11:42 IST
Published By : Hashtagu Telugu Desk
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వరంగల్ పర్యటనలో ప్రమాదం చోటుచేసుకుంది. ఇవాళ కేసీఆర్ వరంగల్ వెళ్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం కాన్వాయ్ నుంచి ఓ మహిళా పోలీస్ అధికారి జారి కిందపడినట్లు సమాచారం. ఆ మహిళ పోలీస్ అధికారికి గాయాలయ్యాయని…వెంటనే ఆసుపత్రికి తరలించారు.
జనగామ జిల్లా పెంబర్తి కళాతోరణం వద్ద ఈ సంఘటన జరిగింది. ఆ పోలీస్ అధికారిణి కాన్వాయ్ ఎక్కే సమయంలో జారిపడినట్లుగా సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

