Accident: రామగుండ సింగరేణిలో ప్రమాదం.. నలుగురు కార్మికులు మృతి
తెలంగాణలోని రామగుండ సింగరేణిలో ప్రమాదం జరిగింది. అడ్రియాల లాంగ్ వాల్ ప్రాజెక్ట్‌లో భూగర్భ గనిలో కొంత భాగం కూలిపోవడంతో నలుగురు కార్మికులు మరణించారు.
- By Hashtag U Published Date - 06:47 PM, Mon - 7 March 22
తెలంగాణలోని రామగుండ సింగరేణిలో ప్రమాదం జరిగింది. అడ్రియాల లాంగ్ వాల్ ప్రాజెక్ట్‌లో భూగర్భ గనిలో కొంత భాగం కూలిపోవడంతో నలుగురు కార్మికులు మరణించారు. సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్‌లోని రామగుండం-III ప్రాంతంలో గని 8వ సీమ్‌లో పనిచేస్తున్న నలుగురు మైనర్లుపై పైకప్పు కూలిపోవడంతో ఈ ఘటన జరిగింది. అసిస్టెంట్ మేనేజర్ తేజ, ముగ్గురు కార్మికులు.. జాడి వెంకటేశ్వర్లు (ఆపరేటర్), రవీందర్ (బడిలి వర్కర్), పిల్లి నరేష్ (ఎంఎస్) మరణించారు. ఈ సంఘటన సోమవారం ఉదయం 10 గంటల సమయంలో జరిగినప్పటికీ సోమవారం మధ్యాహ్నం వెలుగులోకి వచ్చింది. విషయం తెలుసుకున్న గని రెస్క్యూ టీం ఘటనా స్థలానికి చేరుకుని ఆపరేషన్ ప్రారంభించింది. ఘటన తర్వాత కనిపించకుండా పోయిన ముగ్గురు కార్మికులు శిథిలాల కింద చిక్కుకుని చనిపోయారు.