Arogya Sri : ఏపీలో నేటి నుండి ఆరోగ్యశ్రీ సేవలు బంద్
రూ.2,500 కోట్ల బకాయిలకుగాను ప్రభుత్వం రూ.200 కోట్లు మాత్రమే విడుదల చేయడంతో ఆస్పత్రుల యాజమాన్యాలు నిరాశకు గురయ్యాయి
- By Sudheer Published Date - 10:47 AM, Thu - 15 August 24

ఏపీలోని రోగులకు ఎన్టీఆర్ వైద్య సేవ(ఆరోగ్యశ్రీ) నెట్వర్క్ హాస్పటల్ యాజమాన్యాలు షాక్ ఇచ్చాయి. నేటి నుండి ఆరోగ్య శ్రీ సేవలు బంద్ చేస్తున్నట్లు ప్రకటించాయి. రూ.2,500 కోట్ల బకాయిలకుగాను ప్రభుత్వం రూ.200 కోట్లు మాత్రమే విడుదల చేయడంతో ఆస్పత్రుల యాజమాన్యాలు నిరాశకు గురయ్యాయి. త్వరలోనే మరో రూ.300 కోట్లు చెల్లిస్తామని ప్రభుత్వ వర్గాలు హామీ ఇచ్చినా వెనక్కు తగ్గకుండా.. గతంలో ఇచ్చిన సమ్మె నోటీసుకు అనుగుణంగా ఈరోజు నుంచి సేవలు నిలిపివేస్తామని స్పష్టం చేశాయి.
We’re now on WhatsApp. Click to Join.
ఈ సందర్భంగా ఎన్టీఆర్ వైద్యసేవ ట్రస్టు సీఈవో(CEO) లక్ష్మీశ స్పందించారు. అనుబంధ ఆస్పత్రులకు రూ. 200 కోట్ల బకాయిలు విడుదల చేశామని, సోమవారం మరో రూ.300 కోట్లను విడుదల చేస్తామని ప్రకటించారు. ఆసుపత్రులు ఆరోగ్యశ్రీ వైద్య సేవలకు అంతరాయం కలిగించవద్దని విజ్ఞప్తి చేశారు.
Read Also : PM Modi Meet Athletes: భారత అథ్లెట్లతో ప్రధాని మోదీ..!