Aajtak : ప్రధాని మోడీ చనిపోయారంటూ నోరు జారిన యాంకర్
Aajtak : తాజాగా ప్రముఖ న్యూస్ ఛానల్ ఆజ్‌తక్ యాంకర్ సైతం అలాగే నోరు జారింది. గురువారం రాత్రి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణ వార్తను ప్రకటించే సమయంలో, ఆ యాంకర్ ప్రధాని నరేంద్ర మోదీ చనిపోయారని పొరపాటుగా అన్నారు
- By Sudheer Published Date - 09:50 PM, Fri - 27 December 24

అప్పుడప్పుడు రాజకీయ నేతలు, పలు రంగాల ప్రముఖులే కాదు టీవీ యాంకర్లు (TV Anchors ) సైతం నోరు జారుతుంటారు. తాజాగా ప్రముఖ న్యూస్ ఛానల్ ఆజ్‌తక్ యాంకర్ (Aajtak Anchor ) సైతం అలాగే నోరు జారింది. గురువారం రాత్రి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ (Manmohan singh) మరణ వార్తను ప్రకటించే సమయంలో, ఆ యాంకర్ ప్రధాని నరేంద్ర మోదీ (Pradhan Mantri Narendra Modi) చనిపోయారని పొరపాటుగా అన్నారు.
ఈ వ్యాఖ్యలు చేసిన వెంటనే ఆమె తప్పు తెలుసుకొని, తన వ్యాఖ్యలను సరిదిద్దుతూ మన్మోహన్ సింగ్ కన్నుమూశారని చెప్పినప్పటికీ, ఈ పొరపాటు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది.ఇది తొలిసారి కాదు. ఈ యాంకర్ గతంలో రూ.2 వేల నోట్లలో చిప్ ఉందంటూ చేసిన వ్యాఖ్యలు కూడా విమర్శలు ఎదుర్కొన్నాయి. మీడియా ప్రతినిధులుగా, ముఖ్యంగా లైవ్ టెలికాస్ట్ చేసే వారికి మరింత జాగ్రత్త అవసరం అని నిపుణులు సూచిస్తున్నారు. ఈ ఘటనపై నెటిజన్లు తీవ్రంగా స్పందించారు. టీవీ యాంకర్ల బాధ్యతాహీనత ప్రజలను తప్పుడు సమాచారం నమ్మేలా చేస్తుందని విమర్శిస్తున్నారు. ముఖ్యంగా దేశ ప్రధానిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అనాగరికత అని కొందరు అభిప్రాయపడ్డారు.
They declared Modi as ex PM paying tribute to Atalji pic.twitter.com/22pUPi9knn
— Dr Nilima Srivastava (@gypsy_nilima) December 27, 2024
RIP AajTak (2000-2024) 💐
Your background music will be missed. pic.twitter.com/3z0vHtIfII
— Xavier Uncle (@xavierunclelite) December 26, 2024
Read Also : Manmohan Singh : భారత ఆర్థిక సంస్కరణల రూపశిల్పి మై భాయ్ మన్మోహన్ – మలేషియా ప్రధాని ట్వీట్