CM Jagan: పొట్టిశ్రీరాములు త్యాగ ఫలంతోనే ప్రత్యేక రాష్ట్రం: సీఎం జగన్
పొట్టి శ్రీరాములు త్యాగ ఫలం, ఎంతో మంది పోరాట ఫలితంగా తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిందని ఏపీ సీఎం జగన్ రెడ్డి అన్నారు.
- By Balu J Published Date - 12:42 PM, Wed - 1 November 23

CM Jagan: అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగ ఫలం, ఎంతో మంది పోరాట ఫలితంగా తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిందని ఏపీ సీఎం జగన్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించి మీడియాతో మాట్లాడారు. నేడు వారి స్ఫూర్తితో రాష్ట్రంలోని ప్రతి కుటుంబంలో సంక్షేమం, అభివృద్ధి అందించాలన్న సమున్నత లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని ఆయన అన్నారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలుగా మనం బలపడుతూ ఈ దేశాన్ని మరింత బలపరిచేందుకు ఎన్నో అడుగులు ముందుకు వేస్తున్నామని అన్నారు.
దేశ అభివృద్ధిలో మనవంతు పాత్ర పోషిస్తూ ముందుకు సాగుతున్నాం. నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలను తెలియజేశారు. నేడు వైయస్ఆర్ అచీవ్‌మెంట్, వైయస్ఆర్ లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డులు అందుకుంటున్నవారికి జగన్ అభినందనలు తెలియజేశారు.
Also Read: KTR: మాకు యాపిల్ బెదిరింపు నోటిఫికేషన్లు వచ్చాయి: మంత్రి కేటీఆర్