HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >A Pink Wave Across The State Kalvakuntla Kavitha

BRS MLC: రాష్ట్రమంతా పింక్ వేవ్: కల్వకుంట్ల కవిత

రాష్ట్రమంతా పింక్ వేవ్ కనిపిస్తోందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు.

  • Author : Balu J Date : 15-11-2023 - 2:42 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Kavitha
Kavitha

BRS MLC:  రాష్ట్రమంతా పింక్ వేవ్ కనిపిస్తోందని, మూడో సారి సీఎం కేసీఆర్ అధికారంలోకి పచ్చి దక్షిణాదిన తొలిసారి హాట్రిక్ సాధించి రికార్డు సృష్టిస్తారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. ప్రజలు గర్వంగా కారు గుర్తుకు ఓటేసి బీఆర్ఎస్ ను గెలిపించాలన్న ఆశతో ఉన్నారని చెప్పారు. “సీఎం కేసీఆర్ అంటే అభివృద్ధికి గుర్తు. కేసీఆర్ అంటే ప్రేమకు పరాకాష్ట. ” అని వ్యాఖ్యానించారు. గులాబీ జెండా ఎత్తి తెలంగాణ ఉద్యమానికి బయలుదేరినప్పుడు ఇదే కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఎక్కడున్నారని ప్రశ్నించారు.

అందరూ పిడికిలి ఎత్తి ఉద్యమం చేస్తున్నప్పుడు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బందూక్ పట్టుకొని ప్రజల మీదకి పచ్చిన విషయాన్ని మరిచిపోతారా అని అడిగారు. రైతుబంధును రైతులకు బిచ్చమేస్తున్నామని కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారని, పెన్షన్లు, బీమా వృధాగా ఇస్తున్నామని కూడా అంటున్నారని, అధికారంలో లేనప్పుడే ఇంత అహంకారంతో మాట్లాడుతున్న కాంగ్రెస్ పార్టీ రేపు పొరపాటున అధికారంలోకి వస్తే కనీసం ప్రజలను పట్టించుకుంటారా అన్నది ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు. బీఆర్ఎస్, సీఎం కేసీఆర్ అంటే ఆత్మీయత అని, కాంగ్రెస్ పార్టీ అంటే అహంకారం అని తెలిపారు.

గ్రామల్లో తెలంగాణ అభివృద్ధిపై చర్చించాలని కోరారు. ఉమ్మడి పాలనలో ఒక్క ప్రభుత్వమైనా రైతుల గురించి ఆలోచించి ఒక్క పైసా అయినా ఇచ్చిందా అని అడిగారు. లక్షలాది పేద ఇంటి ఆడబిడ్డల కోసం కళ్యాణ లక్ష్మి పథకాన్ని అమలు చేస్తున్నామని, గతంలో ఎవరైనా ఈ ఆలోచన చేశారా అని అడిగారు. మరి ఏమీ చేయని ఎందుకూ పనికిరాని వాళ్లు, ఒక్క నీటి బొట్టును కూడా ఇవ్వనివాళ్లు ఇవాళ సీఎం కేసీఆర్ మీద తొడగొడుతాం, మెడ కోసుకుంటామని మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. తొడగొడితేనో, మెడ కోసుకుంటేనో సీఎం కేసీఆర్ మీద గెలవడం అయ్యే పనికాదని తేల్చిచెప్పారు. సీఎం కేసీఆర్ మీద గెలవాలంటే నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజల గుండెల్లో చోటు సంపాదిస్తేనే అది సాధ్యమవుతుంది తప్పా ఉట్టిగా అయ్యే పనికాదని స్పష్టం చేశారు.

బోధన్ కాంగ్రెస్ అభ్యర్థి సుదర్శన్ రెడ్డి గతంలో సాగునీటి శాఖ మంత్రిగా పనిచేసినా కూడా ఒక్క చెరువును మరమ్మత్తు చేయలేదని విమర్శించారు. సీఎం కేసీఆర్ ఆశీర్వాదంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యే షకీల్ నిజాం సాగర్ కాలువల ఆధునీకరణకు కృషి చేశారని, ఎన్నో చెరువులను బాగు చేసుకున్నామని, చివరి ఆయకట్టుకు కూడా నీళ్లు పచ్చేలా పని చేసుకున్నామని తెలిపారు. బీఆర్ఎస్ అభ్యర్థి షకీల్ సు భారీ మెజారిటీతో గెలిపించి సీఎం కేసీఆర్ కు బోధన్ ను బహుమానంగా ఇద్దామని పిలుపునిచ్చారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 2023 elections
  • BRS MLC
  • K Kavitha
  • telangana

Related News

Ganja Plant

కిరాయి ఉంటున్న ఇంట్లో గంజాయి మొక్కపెంపకం

Telangana : సిద్దిపేట జిల్లాలో పోలీసులు చేపట్టిన డ్రగ్స్ నిఘాలో ఓ విస్తుపోయే నిజం బయటపడింది. పక్క రాష్ట్రం నుంచి వచ్చి ఇక్కడ కూలీగా పనిచేస్తున్న ఓ వ్యక్తి తాను అద్దెకు ఉంటున్న ఇంటి పెరట్లోనే గంజాయి మొక్కను పెంచుతూ పోలీసులకు దొరికిపోయాడు. స్థానికుల అనుమానంతో రంగంలోకి దిగిన పోలీసులు అతడి ఇంటి వెనుక దాచిన గంజాయితో పాటు మొక్కను స్వాధీనం చేసుకున్నారు. ఇంటి వెనకాలే గంజాయి తోట బ

  • Good news for employees.. State government releases pending bills

    న్యూఇయర్ వేళ ఉద్యోగులకు శుభవార్త..పెండింగ్ బిల్లులు విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం

  • 2025 Tragedy Telugu States

    ఈ ఏడాది తెలుగు రాష్ట్రాల్లో విషాదం నింపిన ఘటనలు ఇవే !!

  • Free Ride

    నేడు మందుబాబులకు ఫ్రీ రైడ్

  • CM Revanth Reddy

    సీఎం రేవంత్ పాల‌నలో స్థిరత్వం నుంచి స్మార్ట్ డెవలప్మెంట్‌ దిశగా తెలంగాణ‌!

Latest News

  • రికార్డులు బ్రేక్ చేసిన UPI లావాదేవీలు

  • 2025 ఏడాది లో దేశ వ్యాప్తంగా 166 పులుల మృత్యువాత

  • కెసిఆర్ ను కసబ్ తో సీఎం రేవంత్ పోల్చడంపై హరీశ్ రావు ఫైర్

  • ఎలాన్ మస్క్ సంపాదనలోనే కాదు విరాళాల్లోనూ శ్రీమంతుడే!

  • బిఆర్ఎస్ ను ఇరకాటంలో పెట్టేందుకు సీఎం రేవంత్ వ్యూహాత్మక అడుగులు!

Trending News

    • రవితేజ-వివేక్ ఆత్రేయ కాంబోలో హారర్ థ్రిల్లర్?

    • కొత్త సంవ‌త్స‌రం రోజే అమెరికాకు బిగ్ షాక్‌!!

    • ఫిబ్ర‌వరి 1 నుండి భారీగా పెర‌గ‌నున్న ధ‌ర‌లు!

    • హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్సీలో భార‌త్ జ‌ట్టు 2026 టీ20 ప్రపంచ కప్ గెలవగలదా?

    • కొత్త ఏడాదిలో కేంద్రం బిగ్ షాక్.. భారీగా పెరగనున్న సిగరెట్లు, బీడీ, పాన్ మసాలా ధరలు..

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd