WhatsApp Update : సరికొత్త ఫీచర్.. ఒకసారి చూడగానే మెసేజ్ మాయం!
‘వ్యూ వన్స్’ (View One) అనే ఫీచర్ అభివృద్ధి చేస్తోంది. ఇది అందుబాటులో వస్తే ఒక వ్యక్తి నుంచి
- Author : Maheswara Rao Nadella
Date : 14-12-2022 - 3:26 IST
Published By : Hashtagu Telugu Desk
వాట్సాప్ (WhatsApp) తన యూజర్ల కోసం సరికొత్త ఫీచర్ (New Feature) ను అందుబాటులోకి తీసుకురానుంది. మెటా (Meta) యాజమాన్యంలోని ఈ యాప్ ఒక వ్యక్తి .. మరొకరికి పంపిన సందేశాన్ని ఒకేసారి మాత్రమే చూడగలిగే సదుపాయాన్ని తీసుకుకొస్తోంది. ‘వ్యూ వన్స్’ (View One) అనే ఫీచర్ అభివృద్ధి చేస్తోంది. ఇది అందుబాటులో వస్తే ఒక వ్యక్తి నుంచి సందేశం అందుకున్న వ్యక్తి దాన్ని ఒకసారి చూడగానే అది మాయం అవుతుంది. ఇందుకోసం సెండర్ ‘వ్యూ వన్స్’ (View One) అనే ఆప్షన్ ఎంచుకోవాల్సి ఉంటుంది. వాట్సప్ (WhatsApp) లో సందేశాలతో పాటు ఇప్పటికే ఫొటోలు, వీడియోలను పంపే ఆప్షన్స్ ఉన్నాయి. ‘వ్యూ వన్స్’ (View One) కింద దేన్ని పంపించినా కూడా అవతలి వ్యక్తి దాన్ని ఒకసారి మాత్రమే చూడగలడు.
అలాగే దాన్ని స్క్రీన్‌షాట్ కూడా తీయలేడు. ఎవ్వరికీ ఫార్వర్డ్ చేయలేరు. రిసీవర్ చదివిన వెంటనే ఆ మెసేజ్ ఆటోమేటిక్ గా డిలీట్ అవుతుంది. పంపించిన వాళ్ల ఫోన్లో కూడా అది మళ్లీ కనిపించదు. తమ వాట్సాప్ చాట్ ను ఎవ్వరూ చూడకుండా ఉండాలనుకునే వారికి ఈ ఫీచర్ బాగా ఉపయోగపడుతుంది. ఈ ఫీచర్ ప్రస్తుతం వాట్సాప్ ఆండ్రాయిడ్ బీటా వెర్షన్ లో అందుబాటులో ఉంది. పూర్తిస్థాయిలో అందరికీ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో తెలియాల్సి ఉంది.
Also Read: BRS in Amaravati : అమరావతిలో కేసీఆర్ భారీ బహిరంగసభ..!