Noida: కదులుతున్న కారులో చెలరేగిన మంటలు..దూకేసిన డ్రైవర్
గ్రేటర్ నోయిడా ఎక్స్‌ప్రెస్‌వేపై కారులో మంటలు చెలరేగాయి. ఈ రోజు శనివారం సాయంత్రం కదులుతున్న కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో కలకలం రేగింది.
- By Praveen Aluthuru Published Date - 09:18 PM, Sat - 26 August 23

Noida: గ్రేటర్ నోయిడా ఎక్స్‌ప్రెస్‌వేపై కారులో మంటలు చెలరేగాయి. ఈ రోజు శనివారం సాయంత్రం కదులుతున్న కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో కలకలం రేగింది. మంటలు తీవ్రతరం దాల్చడంతో కారు పూర్తిగా దగ్దమైంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని ఎక్స్‌ప్రెస్‌వేపై ట్రాఫిక్‌ను నిలిపివేసి మంటలను అదుపు చేశారు.
చీఫ్ ఫైర్ ఆఫీసర్ ప్రదీప్ కుమార్ చౌబే తెలిపిన వివరాల ప్రకార.. శనివారం సాయంత్రం 6 గంటల సమయంలో గౌరవ్ మహేశ్వరి సెక్టార్ -144 కట్ ముందు ఎక్స్‌ప్రెస్‌వేపై కదులుతున్న కారులో మంటలు చెలరేగాయి. కారులోంచి దూకి డ్రైవర్ ప్రాణాలు కాపాడుకున్నాడు. అగ్నిమాపక శాఖ సిబ్బంది త్వరితగతిన చర్యలు చేపట్టి మంటలను ఆర్పారు. దీంతో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
Also Read: T Congress : ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ ప్రకటించిన తెలంగాణ కాంగ్రెస్.. ప్రధాన అంశాలివే..