Horrible Incident : భార్యను నగ్నంగా ఊరేగించిన కిరాతక భర్త !
Horrible Incident : రాజస్థాన్‌లో మరో అమానుష ఘటన చోటుచేసుకుంది. ఓ కిరాతకుడు తన భార్యను నగ్నంగా ఊరంతా ఊరేగించాడు.
- Author : Pasha
Date : 02-09-2023 - 10:04 IST
Published By : Hashtagu Telugu Desk
Horrible Incident : రాజస్థాన్‌లో మరో అమానుష ఘటన చోటుచేసుకుంది. ఓ కిరాతకుడు తన భార్యను నగ్నంగా ఊరంతా ఊరేగించాడు. ఈ అమానుష చేష్టలో అతడికి కుటుంబసభ్యులు కూడా సాయం చేశారు! రాజస్థాన్ లోని ప్రతాప్‌గఢ్ జిల్లా నిచాల్కోట గ్రామంలో గురువారం సాయంత్రం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. బాధితురాలికి ఏడాది క్రితమే పెళ్లయింది. కానీ ఆమె అదే గ్రామానికి చెందిన మరో వ్యక్తితో కలిసి ఉన్నట్టు భర్తకు తెలిసింది.
Also read : WhatsApp – New Interface : వాట్సాప్ ఇంటర్ ఫేస్ త్వరలో ఇలా మారిపోతుంది..!!
ఈనేపథ్యంలో ఆ మహిళను.. గురువారం సాయంత్రం దారుణంగా కొట్టిన భర్త, ఆమెను వివస్త్రగా చేసి ఊరిలో కిలోమీటర్ మేర ఊరేగించాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి శుక్రవారం సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో ఆలస్యంగా శుక్రవారం మధ్యాహ్నం రంగంలోకి దిగిన పోలీసులు చర్యలు చేపట్టారు. నిందితులను అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ (Horrible Incident) మండిపడ్డారు. నిందితులను కఠినంగా శిక్షిస్తామని ప్రకటించారు.