Hyderabad: పాతబస్తీలో భారీ అగ్నిప్రమాదం… ఘటనాస్థలికి ఫైరింజన్లు!
హైదరాబాద్ భారీ అగ్నిప్రమాదం జరిగింది. పాతబస్తీలోని ఆదివారం సాయంకాలం ఈ ఘటన చోటుచేసుకుంది. పాతబస్తీలోని ఓ గోడౌన్‌లో ఒక్కసారిగా అగ్నికీలలు ఎగిసిపడడంతో…
- By Anshu Published Date - 09:45 PM, Sun - 19 February 23

Hyderabad: హైదరాబాద్ భారీ అగ్నిప్రమాదం జరిగింది. పాతబస్తీలోని ఆదివారం సాయంకాలం ఈ ఘటన చోటుచేసుకుంది. పాతబస్తీలోని ఓ గోడౌన్‌లో ఒక్కసారిగా అగ్నికీలలు ఎగిసిపడడంతో… స్థానిక ప్రజల్లో అలజడి రేగింది. ఒక్కసారిగా అలుముకున్న అగ్నితో ఏమి జరుగుతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది.
డబీర్‌పూరా పీఎస్ పరిధిలోని ఓ గోడౌన్‌లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ మంటలు నిమిషాల్లోనే ఆ ప్రాంతమంతా చుట్టుకున్నాయి. స్థానికులు వెంటనే ఫైర్ సిబ్బంది సమాచారం ఇచ్చారు. ప్రమాదానికి సంబంధించి సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది హుటాహుటినా అగ్నిప్రమాద ప్రాంతానికి చేరుకున్నారు. తీవ్రంగా శ్రమించి మంటల్ని అదుపులోకి తెచ్చారు.
మెుదట ఒక ఫైర్ ఇంజన్‌తో మంటలు ఆర్పేందుకు ప్రయత్నించగా… ఫలితం రాలేదు. వెంటనే మరో ఫైర్ ఇంజన్ వచ్చి.. రెండు ఒకేసారి ప్రయత్నంచగా అగ్నీకీలలు అదుపులోకి వచ్చాయి. మంటలు అదుపులోకి వచ్చేంత వరకు అక్కడి స్థానికులు తీవ్రంగా ఆందోళన చెందారు. ఎక్కువగా జనసంచారం ఉన్న ప్రాంతం కావటంతో.. ఏమి జరుగుతుందోనని భయాందోళన చెందారు. అయితే షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగిం దా.. లేక వేరే కారణాల వల్ల ఈ ప్రమాదం జరిగిందా అనే విషయం తేలాల్సి ఉంది. ముందుస్తు చర్యల్లో భాగంగా అక్కడి స్థానికులను తాత్కాలికంగా ఖాళీ చేయిస్తున్నట్లు తెలిసింది.