Tourist: పర్యాటకుడికి భయంకరమైన అనుభవం.. మంచం కింద మృతదేహం?
సాధారణ చాలామంది సమయం దొరికినప్పుడల్లా పర్యటక ప్రదేశాలకు వెళ్లి అక్కడి ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ ఉంటారు. ఇది కొన్ని కొన్ని సార్లు పర్యాటకులకు
- By Anshu Published Date - 06:45 PM, Sun - 7 May 23

సాధారణ చాలామంది సమయం దొరికినప్పుడల్లా పర్యటక ప్రదేశాలకు వెళ్లి అక్కడి ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ ఉంటారు. ఇది కొన్ని కొన్ని సార్లు పర్యాటకులకు పర్యటక విదేశాలలో కొన్ని కొన్ని చేదు అనుభవాలు ఎదురవుతూ ఉంటాయి. కొన్ని భయంకరమైన అనుభవాలను కూడా ఎదుర్కొంటూ ఉంటారు. అలా ఒక పర్యాటకుడు కూడా బయానక అనుభవాన్ని ఎదుర్కొన్నారు. పర్యాటక ప్రదేశానికి వెళ్ళిన అతడు ఒక హోటల్ గది తీసుకోగా అక్కడ అతనికి ఒక చేదు అనుభవం ఎదురయింది. అసలేం జరిగిందంటే.. ఈ వ్యవహారం టిబెట్ వెలుగులోకి వచ్చింది.
చైనాకు చెందిన పేరు పొందిన ట్రావెలర్ పర్యాటక ప్రాంతాలు చుట్టేస్తూ టిబెట్‌కు చేరుకున్నాడు. అక్కడ హోటల్ లో బస చేయడానికి ఒక గది తీసుకున్నాడు. కానీ, అక్కడ దుర్వాసన వస్తుండటాన్ని గుర్తించాడు. కింద ఉన్న బేకరీ, లేదా తన పాదాల నుంచి ఈ వాసన వస్తోందేమోనని భావించాడు. సగం రోజు అక్కడే గడిపి, అనంతరం వేరే రూంలోకి మారిపోయాడు. అయితే అది జరిగిన రెండు రోజులకు అతనికి పోలీసుల నుంచి పిలుపు వచ్చింది. ఏం జరిగిందని ఆరా తీయగా పోలీసులకు జరిగింది మొత్తం వివరించాడు.
మొదట తీసుకున్న గదిలో మంచం కిందే ఒక మృతదేహాన్ని గుర్తించినట్లు వెల్లడించారు. అది విని అతను ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ఆ మృతదేహం చాలా రోజుల నుంచి అక్కడ ఉన్నట్లు గుర్తించి అనంతరం అతన్ని తప్పు లేదు అని విడిచిపెట్టారు. అక్కడినుంచి బయటపడ్డ మరుక్షణమే టిబెట్‌ను వీడినట్లు అతను ఒక వార్తా సంస్థకు ఈ విషయాన్ని వెల్లడించాడు. నేను ఆ షాక్ నుంచి ఇంకా కోలుకోలేదు. భయంతో నిద్ర, మానసిక ప్రశాంతత కరవయ్యింది అని వాపోయాడు.