Stampede: కచేరీలో తొక్కిసలాట 9మంది దుర్మరణం..మృతుల పెరిగే అవకాశం..!!
గ్వాటెమాలాలో గురువారం జరిగిన తొక్కిసలాటలో 9మంది మరణించారు. దేశ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
- Author : hashtagu
Date : 16-09-2022 - 8:39 IST
Published By : Hashtagu Telugu Desk
గ్వాటెమాలాలో గురువారం జరిగిన తొక్కిసలాటలో 9మంది మరణించారు. దేశ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో దాదాపు 20 మంది గాయపడినట్లు తెలుస్తోంది. గాయపడినవారికి ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఓ కచేరీ సందర్భంగా ఈ తొక్కిసలాట జరిగింది. ఈ కార్యక్రమం గ్వాటెమాలన్ రాక్ బ్యాండ్ బొహెమియా ద్వారా ముగిసింది.
కార్యక్రమం అనంతరం తిరిగి వెళ్లిపోతుండగా… మరికొందరు అదే సమయంలో లోపలికి వస్తుండటంతో పరిస్థితి అదుపుతప్పింది. దీంతో తొక్కిసలాట జరిగింది. కచేరీ సమయంలో అక్కడ భారీ వర్షం కురవడంతో అక్కడున్న వారంత బయటకు వెళ్లే ప్రయత్నం చేయడంతో కొంతమంది జారీ కిందపడ్డారు. ఈ సమయంలో తొక్కిసలాట జరిగింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జనాన్ని నియంత్రించడంలో ఈవెంట్ నిర్వాహకులు విఫలమయ్యారని క్వెట్జల్టెనాంగో సిటీ మేనేజర్ అమిల్కార్ రివాస్ తెలిపారు