HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >8 Killed Over 40 Injured As Bus Carrying Wedding Guests Falls Off Cliff In Chittoor

AP Road Mishap: చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం.. 8 మంది మృతి

చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం చోటు చేసుకుంది. పెళ్లి నిశ్చితార్థం కార్యక్రమానికి బయలుదేరిన బస్సు చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం భాకరాపేట ఘాట్‌లో శనివారం రాత్రి బోల్తా పడింది.

  • By Hashtag U Published Date - 10:19 AM, Sun - 27 March 22
  • daily-hunt
Accident
Accident

చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం చోటు చేసుకుంది. పెళ్లి నిశ్చితార్థం కార్యక్రమానికి బయలుదేరిన బస్సు చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం భాకరాపేట ఘాట్‌లో శనివారం రాత్రి బోల్తా పడింది. ఈ ఘటనలో ఇప్పటి వరకూ 8 మంది మృతి చెందగా, మరో 47 మందికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. అనంతపురం జిల్లా ధర్మవరంలోని మారుతినగర్‌కు చెందిన పట్టు చీరల వ్యాపారి మలిశెట్టి మురళి కుమారుడు మలిశెట్టి వేణు (25)కు చిత్తూరు జిల్లా పుత్తూరు సమీపంలోని నారాయణవనంకు చెందిన ఓ యువతితో ఆదివారం నిశ్చితార్థం జరగాల్సి ఉంది.

మరికొంతమంది పరిస్థితి విషమం.. క్షతగాత్రులు స్విమ్స్ ఆస్పత్రికి తరలింపు pic.twitter.com/KC0LbxqtaF

— DD News Andhra (అధికారిక ఖాతా) (@DDNewsAndhra) March 27, 2022

వేణుతో పాటు కుటుంబ సభ్యులు, బంధు మిత్రులు 55 మంది శనివారం ఓ ప్రైవేట్‌ బస్సులో తిరుపతికి బయలుదేరారు. రాత్రి 10 గంటల సమయంలో మార్గంమధ్యలో తిరుపతికి 20 కిలోమీటర్ల దూరంలో భాకరాపేట ఘాట్‌లో బస్సు ఒక్కసారిగా 300 అడుగుల లోతున్న లోయలోకి దూసుకెళ్లింది. చుట్టూ చిమ్మ చీకటి, ముళ్ల పొదలు, బండరాళ్ల మధ్య ఏం జరిగిందో తెలియక ప్రయాణికులు హడలిపోయారు. కాపాడండి సారూ.. అంటూ పెద్ద పెట్టున కేకలు వేశారు. బస్సు పల్టీలు కొట్టడంతో ఆ కుదుపులకు కొందరి కాళ్లు, చేతులు విరిగిపోయాయి. మరికొందరికి తీవ్రగాయాలు కావడంతో బస్సు మొత్తం రక్తమయమైంది.ప్రయాణికుల ఆర్తనాదాలు విన్న వాహనదారులు లోయలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు. ముళ్ల కంపలు, రాళ్లు, రప్పల మధ్య అతికష్టం మీద లోయలోంచి కొందరు క్షతగాత్రులను పైకి తీసుకొచ్చారు.తిరుపతి అర్బన్‌ ఎస్పీ వెంకట అప్పలనాయుడు భాకరాపేట, చంద్రగిరి పోలీసులతో ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ముమ్మరం చేశారు.

 

Chittoor Accident

కలెక్టర్‌ హరినారాయణన్, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి కుమారుడు హర్షితరెడ్డి హుటాహుటిన అక్కడికి చేరుకుని సహాయక చర్యలు పర్యవేక్షించారు. 250 నుంచి 300 అడుగుల లోతు నుంచి క్షతగాత్రులను పైకి తీసుకొచ్చేందుకు వందలాది మంది పోలీసులు, రోప్‌ బృందాలు, స్థానికులు చాలా కష్టపడాల్సి వచ్చింది.ఆరుగురి మృతదేహాలు లభ్యం కాగా, 35 మంది క్షతగాత్రులను చికిత్స నిమిత్తం 20 అంబులెన్స్‌లలో తిరుపతి రుయాకు తరలించారు. కాగా, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.

Andhra Pradesh | 7 people killed and 45 injured in a bus accident last night in Chittoor

Accident happened as the bus fell off the cliff due to driver's negligence in Bakrapeta, 25 kms away from Tirupati. Aggrieved were shifted to a nearby hospital: SP, Tirupati pic.twitter.com/Vi3DFj36Uy

— ANI (@ANI) March 27, 2022


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 8 killed 40 injured
  • Chittoor
  • road accident
  • road accident in Chittoor

Related News

Road Accident Chevella

Road Accident : ఆర్టీసీ ప్రయాణానికి కూడా రక్షణ కరువేనా…? గాల్లో కలిసిపోతున్న ప్రాణాలు !!

Road Accident : ఆర్టీసీ ప్రయాణం సురక్షితం అని ప్రభుత్వాలు చెపుతుంటే..రోజు ఎక్కడో ఓ చోట మాత్రం ఆర్టీసీ బస్సులు ప్రమాదానికి గురి అవుతున్నాయి. కొన్ని చోట్ల ఆర్టీసీ డ్రైవర్ల తప్పిదాల వల్ల ప్రమాదాలు జరుగుతుంటే

  • Road Accident

    Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. 18 మంది మృతి!

Latest News

  • Fastest Trains: ప్ర‌పంచంలో అత్యంత వేగంగా న‌డిచే రైళ్లు ఇవే!

  • Vehicle Sales: 42 రోజుల్లోనే 52 లక్షల వాహనాల అమ్మ‌కాలు!

  • North Korea- South Korea: ఆ రెండు దేశాల మ‌ధ్య ముదురుతున్న వివాదం?!

  • India- Pakistan: ఒలింపిక్స్‌కు అర్హ‌త సాధించిన జ‌ట్లు ఇవే.. పాక్ క‌ష్ట‌మే!

  • MS Dhoni: ఐపీఎల్ 2026లో ధోని ఆడ‌నున్నాడా? క్లారిటీ ఇదే!

Trending News

    • Dismissed On 99: టెస్టుల్లో అత్యధిక సార్లు 99 పరుగుల వ‌ద్ద‌ అవుటైన భారత బ్యాట్స్‌మెన్లు వీరే!

    • HDFC Bank: హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కస్టమర్లకు శుభవార్త!

    • Sanju Samson: సంజు శాంసన్ ట్రేడ్ రేస్‌లోకి సీఎస్కే!

    • Common Voter: వల్లభనేని వంశీ, కొడాలి నాని తీరుపై కామ‌న్ మ్యాన్ ఫైర్!

    • MS Dhoni Retirement: ఐపీఎల్ నుంచి ధోని రిటైర్ అవుతున్నాడా?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd