Uttar Pradesh : లడ్డూ మహోత్సవ్..ఏడుగురిని బలి తీసుకుంది
Uttar Pradesh : మహోత్సవంలో ఏర్పాటు చేసిన వేదిక అకస్మాత్తుగా కుప్పకూలడం(Watchtower collapses)తో ఏడుగురు వ్యక్తులు (7 dead) ప్రాణాలు కోల్పోగా
- By Sudheer Published Date - 12:35 PM, Tue - 28 January 25

ఉత్తరప్రదేశ్‌లోని బాగ్పత్ జిల్లాలో జైనులు నిర్వహించిన లడ్డూ మహోత్సవం (Laddu Mahotsav) విషాదకరంగా మారింది. మహోత్సవంలో ఏర్పాటు చేసిన వేదిక అకస్మాత్తుగా కుప్పకూలడం(Watchtower collapses)తో ఏడుగురు వ్యక్తులు (7 dead) ప్రాణాలు కోల్పోగా, 60 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన బాగ్పత్ (Baghpat) ప్రజలను దిగ్బ్రాంతికి గురి చేసింది.
Ayodhya Rami Reddy : రాజీనామా పై వైసీపీ ఎంపీ అయోధ్య రామిరెడ్డి క్లారిటీ
ఈ కార్యక్రమం కోసం వెదురుకర్రలతో తాత్కాలిక వేదికను నిర్మించారు. భారీ జనసమూహం ఒక్కసారిగా వేదికపైకి రావడంతో అది బరువును తట్టుకోలేక కూలిపోయింది. వేదిక కింద పలువురు ఇరుక్కుపోయారు. సహాయక చర్యలు వెంటనే ప్రారంభమైనప్పటికీ, ప్రాణనష్టం చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ (UP chief minister Yogi Adityanath ) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
బాధిత కుటుంబాలకు సానుభూతి తెలిపారు. సహాయక చర్యలను వేగవంతం చేసి, గాయపడిన వారికి మెరుగైన వైద్య సౌకర్యాలు అందించేందుకు అధికారులను ఆదేశించారు. బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం అందించడంపై కూడా సీఎం చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం. ప్రమాద స్థలంలో సహాయక బృందాలు కొనసాగుతున్నాయి. గాయపడినవారిని సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. తీవ్రంగా గాయపడిన కొందరిని మెరుగైన వైద్య సేవల కోసం ఇతర ఆసుపత్రులకు తరలించారు.