60 Killed: రష్యా దాష్టీకం…పాఠశాలపై బాంబు దాడి..60 మంది మృతి..!!
- By Hashtag U Published Date - 09:53 AM, Mon - 9 May 22

రష్యా, ఉక్రెయిన్ ల మధ్య యుద్దం కొనసాగుతూనే ఉంది. దాదాపు 73రోజులుగా సాగుతున్న ఈ యద్దం వల్ల ఇప్పటికే ఉక్రెయిన్ లో చాలా ప్రాంతాలు నేటమట్టమయ్యాయి. వాటిని రష్యా సైనిక బలగాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. అయితే నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్, యూరోపియన్ యూనియన్ తోపాటు అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, జపాన్ వంటి దేశాలు అందజేస్తోన్న ఆయుధ సామాగ్రితో రష్యా ధాడిని…ఉక్రెయిన్ సైన్యం అడ్డుకుంటోంది. ఈ క్రమంలో రెండు వైపులా పెద్దెత్తున ప్రాణనష్టం,ఆస్తినష్టం జరుగుతోంది. అయితే ఈ పరిణామాల మధ్య రష్యా మరింత రెచ్చిపోయింది. జనావాసాలను సైతం లెక్క చేయకుండా పునరావాస భవనాలపై కూడా దాడులకు పాల్పడుతోంది.
తాజాగా ఉక్రెయిన్ తూర్పు ప్రాంతంలోని ఓ పాఠశాల భవనంపై రష్యా వైమానికి బలగాలు బాంబులు విసిరాయి. ఈ ఘటనలో 60 మంది మరణించారని లుహాన్స్క్ రీజియన్ గవర్నర్ సెర్హీ హైదీ తెలిపారు. దాదాపు నాలుగు వందల మంది గాయపడినట్లు చెప్పారు. యుద్ధం ఆరంభమైన తర్వాత…ఈ స్కూల్ భవనాన్ని షెల్టర్ జోన్ గా అక్కడి సర్కార్ మార్చింది. అయితే 95మంది వరకు స్థానికులు అక్కడ తలదాచుకుంటున్నారు. ఈ భవన సముదాయంపై రష్యా వైమానిక బలగాలు బాంబులు విసిరినట్లు సైర్హీ హైదీ తెలిపారు. సమాచారం తెలియడంతోనే సహాయక చర్యలు చేపట్టి…30మందిని కాపాడగలిగామని చెప్పారు.
Related News

2 Lakh Kids Deported: ఉక్రెయిన్ నుంచి రష్యాకు రెండు లక్షల మంది పిల్లలు బలవంతంగా తరలింపు
పిల్లలతో సహా అనేక మందిని ఉక్రెయిన్ నుండి రష్యాకు తరలించినట్లు మాస్కో పేర్కొంది.