HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >5500 Year Old Gate Discovered In Israel Offers Glimpse Into Ancient Urbanization

Israel: 5,500 ఏళ్ల నాటి గేటును కనుగొన్న శాస్త్రవేత్తలు.. ఎక్కడో తెలుసా?

శాస్త్రవేత్తలు ఇప్పటికే ఎన్నో రకాల వస్తువులను కనుగొన్న విషయం తెలిసిందే. అవే కాకుండా ఎప్పటికప్పుడు పురాతన వస్తువులను వెలికి తీసే పని

  • Author : Anshu Date : 17-08-2023 - 4:38 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Israel
Israel

శాస్త్రవేత్తలు ఇప్పటికే ఎన్నో రకాల వస్తువులను కనుగొన్న విషయం తెలిసిందే. అవే కాకుండా ఎప్పటికప్పుడు పురాతన వస్తువులను వెలికి తీసే పనిలో భాగంగా నిమగ్నమై ఉన్నారు. ఇందులో భాగంగానే ఇప్పటికే ఎన్నో పురాతన వస్తువులు బయటపడ్డ విషయం తెలిసింది. కొన్ని వందల, వేల నాటి వస్తువులు కూడా వెలికితీతలో బయటపడ్డాయి. ఇందులో భాగంగానే తాజాగా కూడా దాదాపు 5,500 ఏళ్ల నాటి ఒక పురాతన వస్తువు బయటపడింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఇజ్రాయెల్‌లో తవ్వకాల్లో ఒక పురావస్తు ఆవిష్కరణ బయటపడింది.

ఇజ్రాయెల్‌లోని పురాతన నగరమైన టెల్‌ ఎరానీలో 5,500 ఏళ్ల కాలం నాంటి పురాతన రాయి, మట్టి ఇటుకతో నిర్మించిన గేటును పరిశోధకులు కనుగొన్నట్లు ఇజ్రాయెల్ యాంటిక్విటీస్ అథారిటీ మంగళవారం ప్రకటించింది. దాదాపు 1.5 మీటర్ల గేటు చెక్కుచెదరకుండా ఉంది. నీటి పైప్‌లైన్‌ను ఏర్పాటు చేయడానికి ముందు, కిర్యాత్ గట్ పారిశ్రామిక జోన్ సమీపంలో త్రవ్వకాలలో పరిశోధకులు ఈ నిర్మాణాన్ని కనుగొన్నారు. టెల్ ఎరానీలో తవ్వకాల్లో గేట్‌ మాత్రమే కాకుండా కోట వ్యవస్థలోని కొంత భాగాన్ని కూడా ఆవిష్కరించింది. ఇవన్నీ దాదాపు 3,300 సంవత్సరాల క్రితం ప్రారంభ కాంస్య యుగానికి చెందినవని పరిశోధకులు అంచనా వేస్తున్నారు. ఈ ఆవిష్కరణ పురాతన కాలంలో పట్టణ కేంద్రాల అభివృద్ధి, వాటి వ్యూహాత్మక రక్షణపై విలువైన సమాచారాన్ని అందిస్తుంది.

ఇజ్రాయెల్ యాంటిక్విటీస్ అథారిటీ తరపున తవ్వకాల డైరెక్టర్ ఎమిలీ బిషోఫ్ ప్రకారం.. ప్రారంభ కాంస్య యుగం నాటి ఇంత పెద్ద ద్వారం బయటపడటం ఇదే మొదటిసారి. గేటు, కోట గోడలను నిర్మించడానికి రాళ్లను దూరం నుంచి తీసుకురావాలి. మట్టి ఇటుకలు తయారు చేయాలి. కోట గోడలు నిర్మించాలి. ఇది ఎవరో లేదా కొంతమంది వ్యక్తులు సాధించలేదు. కోటల వ్యవస్థ పట్టణీకరణ ప్రారంభానికి ప్రాతినిధ్యం వహించే సామాజిక సంస్థకు నిదర్శనం అని ఆయన తెలిపారు.

అలాగే అప్పట్లో నగరంలోకి ప్రవేశించాలనుకునే బాటసారులు, వ్యాపారులు లేదా శత్రువులందరూ ఈ ద్వారం గుండా వెళ్ళవలసి వచ్చే అవకాశం ఉంది అని ఇజ్రాయెల్ యాంటిక్విటీస్ అథారిటీ పరిశోధకుడు మార్టిన్-డేవిడ్ పాస్టర్నాక్ వెల్లడించారు. కాగా కొత్తగా వెలికితీసిన గేట్ దేశంలో పట్టణీకరణ ప్రక్రియ ప్రారంభాన్ని ప్రభావితం చేసే ఒక ముఖ్యమైన ఆవిష్కరణ. ఇటీవలి సంవత్సరాలలో ఇజ్రాయెల్ యాంటిక్విటీస్ అథారిటీ నిర్వహించిన విస్తృతమైన త్రవ్వకాలు పట్టణీకరణ ప్రారంభం నుండి ముగింపు వరకు డేటింగ్ చేయడానికి దారితీశాయని తెలిపారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Israel.
  • old gate

Related News

    Latest News

    • Tamil Nadu Politics: తమిళనాడు రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్.. గవర్నర్‌తో మరోసారి విజయ్ భేటీ

    • KTR: మాజీ మంత్రి కేటీఆర్‌పై క్రిమినల్ కేసు నమోదు..

    • TVK ఎమ్మెల్యేలతో విజయ్ కీలక భేటీ

    • AIADMK: విజయ్ కు మద్దతు ఇచ్చేది లేదన్న అన్నాడీఎంకే

    • Amanpreet Singh: కోహ్లీ సహచరుడు.. పంజాబ్ కింగ్స్ ప్లేయర్ కన్నుమూత

    Trending News

      • BREAKING: ప్రభుత్వ ఏర్పాటులో విజయ్ కు బిగ్ షాక్ ఇచ్చిన గవర్నర్!

      • AIADMK: తమిళ్ పాలిటిక్స్‎లో బిగ్ ట్విస్ట్.. అన్నాడీఎంకే లో రగడ

      • TVK Vijay Trisha: ఎమ్మెల్యేగా త్రిష అక్కడ నుంచే పోటీ..?

      • మీ మొబైల్‌ ఫోన్లలో పెద్ద సైరన్ మెసేజ్ వచ్చిందా.. భయపడవద్దని కేంద్రం సూచన

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd