CM Relief Fund: సౌదీలో చనిపోయిన ఇద్దరు వలస కుటుంబాలకు 5 లక్షల సాయం
- By Balu J Published Date - 09:55 AM, Sat - 16 March 24

CM Relief Fund: సౌది ఆరేబియాలో చనిపోయిన ఇద్దరు వలస కూలీల కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి 5 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం ప్రకటించింది. రాజన్న సిరిసిల్లా జిల్లా కోనరావుపేట మండలం బావుసాయిపేటకు చెందిన బొడ్డు బాబు, వేములవాడ మండలం మర్రిపెల్లి గ్రామానికి చెందిన శశికుమార్ గత డిసెంబర్‌లో సౌదీలో చనిపోయారు. ఒక్కో కుటుంబానికి 5 లక్షల చొప్పున సహాయం విడుదల చేస్తూ శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు.
విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకారం, భారతదేశానికి తిరిగి రావాలనుకునే వారికి అవసరమైన ఏర్పాట్లతో పాటు భారతీయ కార్మికులకు సంబంధించిన అన్ని సమస్యలను పరిష్కరించడానికి కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ ఒక సంక్షోభ నిర్వహణ బృందాన్ని ఏర్పాటు చేసింది. సౌదీ అరేబియాలో భారతీయులు అతిపెద్ద ప్రవాస సంఘం, దాదాపు 3 మిలియన్ల మంది ఉన్నారు.