Bangladesh: నౌకలో 36 మంది సజీవదహనం
- By hashtagu Published Date - 12:00 PM, Fri - 24 December 21
బంగ్లాదేశ్ లో ఘోర ప్రమాదం సంభవించింది. ఓ మూడంతస్తుల నౌకలో మంటలు చెలరేగిన ఘటనలో 36 మంది సజీవదహనమయ్యారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. ఈ ప్రమాదం ఢాకాకు 250 కిలోమీటర్ల దూరంలోని ఝకాకఠి ప్రాంతంలో జరిగింది.
ఢాకా నుంచి బరుంగా వెళ్తుండగా తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో నౌకలో మంటలు చెలరేగాయి. మంటలు ఒక్కసారిగా చెలరేగడంతో ప్రయాణికులు తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు. ప్రమాద సమయంలో నౌకలో దాదాపు 500 మంది ఉన్నారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన దాదాపు 100 మందిని బారిసాల్ లోని ఆసుపత్రికి తరలించి చికిత్స నందిస్తున్నారు.
ప్రాణాలు కాపాడుకోవడానికి వీరిలో చాలా మంది నదిలోకి దూకేశారు.నదిలోకి దూకినవారిలో కొందరు నీటిలో మునిగిపోయారు. వారి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్టు అధికారులు తెలిపారు.