Fire : బంగ్లాదేశ్ లో భారీ అగ్నిప్రమాదం..35మంది మృతి…!!
దాయాది దేశం బంగ్లాదేశ్ లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది.35 d35
- By hashtagu Published Date - 01:58 PM, Sun - 5 June 22
దాయాది దేశం బంగ్లాదేశ్ లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. సీతాకుండ ప్రాంతంలోని ప్రైవేట్ ఇన్ లాండ్ కంటెయినర్ లో భారీ మంటలు ఎగిసిపడ్డాయి. చిట్టగాంగ్ పోర్టు సమీపంలో శనివారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. అగ్నిమాపకనిరోధక విభాగం తీవ్రంగా శ్రమించింది. అగ్ని కీలలు ఇతర ప్రాంతాలకు విస్తరించకుండా చర్యలు చేపట్టింది అగ్నిమాపకనిరోధక విభాగం.
ఆదివారం మధ్యాహ్నం వరకు 35 మంది మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. ప్రమాదంలో కనీసం 450 మంది వరకు మరణించి ఉంచాటరని సమాచారం. నిల్వ ఉంచిన రసాయనాల వల్లే ప్రమాదం జరిగినట్లు పోలీసులు ప్రకటించారు. కంటెయినర్లలో మండే స్వభావం కలిగిన రసాయనాలు ఉండటంతో ఒకదాని తర్వాత ఒకటి వరసగా పేలినట్లు గుర్తించారు.