EV Charging Stations : హైదరాబాద్లో త్వరలో 330 ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు
- Author : Prasad
Date : 02-07-2022 - 8:54 IST
Published By : Hashtagu Telugu Desk
హైదరాబాద్: త్వరలో నగరంలో 330 ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు రానున్నాయి. ఎలక్ట్రిక్ వాహనాల (EV) వినియోగాన్ని ప్రోత్సహించడం ద్వారా కార్బన్ ఉద్గారాలను తగ్గించడానికి, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ 230 EV ఛార్జింగ్ స్టేషన్లను ప్రతిపాదించగా.. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ ) తమ అధికార పరిధిలో 100 ఛార్జింగ్ స్టేషన్లను ప్రతిపాదించింది. GHMC, HMDA, తెలంగాణ స్టేట్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (TSREDCO) అంగీకరించిన విధంగా ఆదాయ-భాగస్వామ్య నమూనాలో సౌకర్యాలు ఏర్పాటు చేయనున్నారు. ప్రతి స్టేషన్‌లో హై-స్పీడ్ ఛార్జింగ్ సౌకర్యంతో పాటు సాధారణ ఛార్జింగ్ సదుపాయం ఉంటుంది. “చార్జింగ్ ఖర్చు గంటకు రూ. 18 కిలోవాట్ (kWh) గా నిర్ణయించామని.. అయితే ధరలు సవరించే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. ప్రస్తుతం, నగరంలో దాదాపు 150 EV ఛార్జింగ్ స్టేషన్లు ఉన్నాయి. వాటిలో చాలా వరకు హైదరాబాద్ మెట్రో స్టేషన్లు, రైల్వే స్టేషన్లు, పెట్రోల్ బంక్ లకు సమీపంలో ఉన్నాయి.