Hyderabad: బవాజీర్ హత్య కేసులో ముగ్గురు అరెస్ట్
సామాజిక కార్యకర్త షేక్ సయీద్ బవాజీర్ హత్య కేసులో పోలీసులు దూకుడు పెంచారు. ఈ కేసులో ముగ్గురు అనుమానితుల్ని అదుపులోకి తీసుకున్నారు.
- Author : Praveen Aluthuru
Date : 12-08-2023 - 5:38 IST
Published By : Hashtagu Telugu Desk
Hyderabad: సామాజిక కార్యకర్త షేక్ సయీద్ బవాజీర్ హత్య కేసులో పోలీసులు దూకుడు పెంచారు. ఈ కేసులో ముగ్గురు అనుమానితుల్ని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో భాగంగా బండ్లగూడ పోలీసులు, కమిషనర్ టాస్క్ ఫోర్స్ సంయుక్తంగా విచారిస్తున్నారు. ఆగస్టు 10వ తేదీన బండ్లగూడలో బవజీర్ హత్యకు గురయ్యాడు. నిందితులు మారణ ఆయుధాలతో షేక్ సయీద్ బవాజీర్ పై కత్తులతో దాడి చేశారు. తీవ్ర గాయాలపాలైన సయీద్ బవాజీర్ అక్కడికక్కడే మృతి చెందాడు.
ప్రజాసమస్యలపై గళమెత్తాడు షేక్ సయీద్ బవాజీర్. ఏ క్రమంలో అభివృద్ధి పనుల్లో జాప్యాన్ని నిలదీశాడు. బీఆర్ఎస్ లీడర్లపై విమర్శలు చేశాడు. ప్రజాసమయాలపై పోరాడాడు. దీంతో సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించాడు. అయితే తన పోరాటంపై కొందరు తనను హత్య చేసేందుకు ప్రయత్నిస్తున్నట్టు గతంలోనే చెప్పాడు. ఓ వీడియో రూపంలో తనకు ప్రాణహాని ఉన్నట్టు పేర్కొన్నాడు.
Also Read: Kajal Agarwal: నాగ్ తో రొమాన్స్ కు కాజల్ రెడీ, ఇదిగో అప్డేట్!