Covid Updates: దేశంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది!
- Author : Balu J
Date : 18-01-2022 - 1:07 IST
Published By : Hashtagu Telugu Desk
దేశంలో కరోనా మహమ్మారి ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. తాజాగా 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా 16.49లక్షల మందికి వైరస్ పరీక్షలు నిర్వహించగా.. 2,38,018 మందికి పాజటివ్‌గా తేలింది. పాజిటివిటీ రేటు కూడా 19.65శాతం నుంచి 14.43శాతానికి తగ్గడం ఊరటనిస్తోంది. మరోవైపు 24 గంటల వ్యవధిలో మరో 310 మంది కొవిడ్‌తో ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు 4,86761 మందిని మహమ్మారి పొట్టనబెట్టుకుంది. ఒమిక్రాన్ కేసుల సంఖ్య 9వేలకు చేరువైంది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 8,891 మందిలో కొత్త వేరియంట్ నిర్ధారణ అయినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాలు వెల్లడించాయి.
