MG Motors ZS-EV:MG Motors నుంచి ఎలక్ట్రిక్ కారు రిలీజ్…. ధర ఎంతంటే..?
పెట్రోల్, డీజిల్ ధరలు తారాస్థాయికి చేరుకున్నాయి. వాటి పేరు వింటేనే గుండె గుభేల్అంటోంది. ఈ నేపథ్యంలో దేశంలో ఈ -వెహికల్స్ కు రోజురోజుకూ క్రేజ్ పెరుగుతోంది.
- By Hashtag U Published Date - 07:40 AM, Tue - 8 March 22

పెట్రోల్, డీజిల్ ధరలు తారాస్థాయికి చేరుకున్నాయి. వాటి పేరు వింటేనే గుండె గుభేల్అంటోంది. ఈ నేపథ్యంలో దేశంలో ఈ -వెహికల్స్ కు రోజురోజుకూ క్రేజ్ పెరుగుతోంది. అంతర్జాతీయ స్థాయి ఆటో కంపెనీలు ఎలక్ట్రిక్ వెహికల్స్ తో దేశీయ మార్కెట్లోకి అడుగుపెడుతున్నాయి. ఇప్పటికే టాటా మోటార్స్ నుంచి ఎలక్ట్రిక్ వాహనాలు మార్కెట్లోకి దూసుకొచ్చాయి. లేటెస్టుగా MG Motor Indiaకూడా లేటెస్ట్ వాహనాలతో మార్కెట్లోకి ఎంటర్ అవుతోంది.
ఎంజీ మోటార్ ఇండియా zs-evకొత్త వెర్షన్ దేశంలో ప్రవేశపెట్టింది. ఎంజి మోటార్స్ zs-evఒక్కసారి ఛార్జింగ్ చేస్తే…461కిలోమీటర్ల మైలేజీని అందిస్తోంది. అంటే ఒక్కసారి చార్జ్ చేస్తే హైదరాబాద్ నుంచి రాజమండ్రి వరకు వెళ్లవచ్చు. ఇది. 50.3kwhఅతిపెద్ది, సురక్షితమైన, శక్తివంతమైన బ్యాటరీని కలిగి ఉంటుంది. zs-ec షోరూమ్ ధర రూ. 21.99లక్షలతో ప్రారంభం అవుతుంది. కొత్త zs-ev రెండు వేరియంట్స్ లో లభిస్తుంది. ఎక్సైజ్ ఎక్స్ క్లూజివ్ ధరలు వరుసగా రూ. 21.99లక్షలు, రూ. 25.88లక్షలుగా ఉన్నాయి.
ఎక్స్ క్లూజివ్ వేరియంట్ కు సంబంధించి బుకింగ్ ప్రారంభించినట్లు కంపెనీ తెలిపింది. ఎక్సైట్ ట్రిమ్ బుకింగ్స్ జూలై 2022నుంచి ప్రారంభం అవుతాయని ప్రకటించింది. zs-evకి డిమాండ్ ప్రోత్సాహకరంగా ఉందని…కొత్త వేరియంట్ కస్టమర్లతో బ్రాండ్ అనుబంధాన్ని మరింత బలోపేతం చేస్తుందని ఎంజీ మోటార్ ఇండియా ఛైర్మన్ , మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ చాబా తెలిపారు. లండన్, యూరప్, ఆస్ట్రేలియాతో పాటు కీలకమైన ప్రపంచ మార్కెట్లలో zs-ev సక్సెస్ అయినట్లు తెలిపారు.
ఇక ఈ కారు ఫీచర్స్ గురించి తెలుసుకున్నట్లయితే..పూర్తిగా కొత్త స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ బ్యాటరీతో వస్తుంది. 6 ఎయిర్ బ్యాగులు, రియర్ డ్రైవ్ అసిస్ట్, 360 డిగ్రీ కెమెరా, హిల్ డిసెంట్ కంట్రోల్ , esc, tpms, తోపాటు అనేక ఇతర ఫీచర్లు ఉన్నాయి. zs-ev ismart నుంచి 75కి పైగా కనెక్ట్ చేసిన కారు ఫీచర్స్ ను అందిస్తుంది. zs-evని రెండు సంవత్సరాల పాటు నడపడం వల్ల 70లక్షల కిలోల కర్భన ఉద్గారాలు గాల్లోకి రిలీజ్ కాకుండా సేవ్ అవుతుంది. ఇది 42వేల చెట్లను నాటడంతో సమానం అని చెప్పవచ్చు. ఈ కారు నాలుగు రంగుల్లో అందుబాటులో ఉంది. ఫెర్రిస్ వైట్, కరెంట్ రెడ్, అషెన్ సిల్వర్, సేబుల్ బ్లాక్ రంగుల్లోఉంది. ఇందులో డిజిటల్ బ్లూటూత్ ఫీచర్, టైప్ సి ఛార్జింగ్ పోర్టులతో5 యూఎస్బి పోర్టులు కూడా ఉన్నాయి.