200 Cases : ‘ఓమిక్రాన్’ ఓ మై గాడ్.. 200 కేసులు నమోదు
యావత్ ప్రపంచానికి వణుకు పుట్టిస్తోన్న కొత్త వేరియంట్ ఒమిక్రాన్.. దేశంలోనూ శరవేగంగా వ్యాపిస్తోంది.
- By Balu J Published Date - 12:14 PM, Tue - 21 December 21
యావత్ ప్రపంచానికి వణుకు పుట్టిస్తోన్న కొత్త వేరియంట్ ఒమిక్రాన్.. దేశంలోనూ శరవేగంగా వ్యాపిస్తోంది. చాపకింద నీరులా వ్యాప్తిస్తూ రాష్ట్రాలను వణుకు పుట్టిస్తోంది. ఇప్పటివరకు ఈ వేరియంట్ 12 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు పాకగా.. మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 200కు చేరినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. అత్యధికంగా మహారాష్ట్రలో 54, దిల్లీలో 54 కేసులు బయటపడ్డాయి. కాగా ఇప్పటివరకు తెలంగాణలో 20కుపైగా కేసులు నమోదయ్యాయి. ఓమిక్రాన్ నేపథ్యంలో తెలంగాణ ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. ఈ మేరకు పలు ఆస్పత్రుల్లో బెడ్స్, అనిన రకాల వసతులను కల్పిస్తున్నారు.
