HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >2 New Judges To Supreme Court Chief Justice Of India Chandrachud Administers Oath

Supreme Court New Judges : సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ ఉజ్జల్ భుయాన్.. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి పదోన్నతి

Supreme Court New Judges : సుప్రీంకోర్టుకు ఇద్దరు కొత్త న్యాయమూర్తులు నియమితులయ్యారు.

  • By Pasha Published Date - 12:57 PM, Fri - 14 July 23
  • daily-hunt
Supreme Court New Judges
Supreme Court New Judges

Supreme Court New Judges : సుప్రీంకోర్టుకు ఇద్దరు కొత్త న్యాయమూర్తులు నియమితులయ్యారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా జస్టిస్ ఉజ్జల్ భుయాన్, జస్టిస్ ఎస్ వెంకటనారాయణ భట్టిలతో భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) డీవై చంద్రచూడ్ ఈరోజు ప్రమాణం చేయించారు. సుప్రీంకోర్టు ఆడిటోరియంలో ఈ ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది. దీంతో  సుప్రీంకోర్టుకు మంజూరు అయిన మొత్తం 34 జడ్జి  పోస్టుల్లో 32 ఇప్పటివరకు  భర్తీ అయ్యాయి. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భుయాన్, కేరళ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ వెంకటనారాయణ భట్టి పేర్లను సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా పదోన్నతి కోసం జూలై 5న సీజేఐ నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియం కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. ఈ సిఫార్సును జూలై 12న కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది.ఈ ఇద్దరు న్యాయమూర్తుల పదోన్నతిపై(Supreme Court New Judges) న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ బుధవారం ప్రకటన చేశారు.

Also read : Google Pay UPI LITE : పిన్ లేకుండానే యూపీఐ పేమెంట్స్.. గూగుల్ పేలో “యూపీఐ లైట్” ఫీచర్

జస్టిస్ ఉజ్జల్ భుయాన్

1964 ఆగస్టు 2న జన్మించిన జస్టిస్ ఉజ్జల్ భుయాన్.. 2011 అక్టోబరు 17న గౌహతి హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఆయన అంతకుముందు  గౌహతి హైకోర్టు లో అత్యంత సీనియర్ న్యాయమూర్తిగా వ్యవహరించారు. 2022 జూన్ 28 నుంచి ఆయన తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేస్తున్నారు. పన్నుచట్టాలపై ఆయనకు స్పెషలైజేషన్ ఉంది. “ఉజ్జల్ భుయాన్ తీర్పులు చట్టం, న్యాయానికి సంబంధించిన విస్తృత సమస్యలను కవర్ చేస్తాయి. జస్టిస్ ఉజ్జల్ భుయాన్ సమగ్రత, సమర్థత కలిగిన  న్యాయమూర్తి” అని సుప్రీంకోర్టు కొలీజియం చేసిన తీర్మానాన్ని సుప్రీంకోర్టు వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేశారు.

Also read : Credit Card: మీరు క్రెడిట్ కార్డ్‌ వాడుతున్నారా.. అయితే, కార్డు బిల్లు ఆలస్యంగా చెల్లిస్తే వడ్డీ ఎలా లెక్కిస్తారంటే..?

జస్టిస్ వెంకటనారాయణ భట్టి

1962 మే 6న జన్మించిన జస్టిస్ భట్టి..  2013 ఏప్రిల్ 12న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఆయన అంతకుముందు అదే హైకోర్టులో అత్యంత సీనియర్‌ న్యాయమూర్తిగా సేవలందించారు. 2022 ఆగస్టు నుంచి సుప్రీంకోర్టు బెంచ్‌లో ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టుకు ఎలాంటి ప్రాతినిధ్యం లేదని సుప్రీంకోర్టు కొలీజియం తన తీర్మానంలో పేర్కొంది. ఈ లోటును భర్తీ చేసేందుకుగానూ జస్టిస్ భట్టికి సుప్రీంకోర్టు  న్యాయమూర్తిగా పదోన్నతి కల్పించారు. జస్టిస్ భట్టి 2019 మార్చిలో కేరళ హైకోర్టుకు బదిలీ అయ్యారు. 2023 జూన్ 1 నుంచి అక్కడ ప్రధాన న్యాయమూర్తిగా పనిచేస్తున్నారు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Administers Oath
  • CHief Justice Of India
  • cji chandrachud
  • Justice Bhuyan
  • Justice DY Chandrachud
  • Supreme Court
  • Supreme Court New Judges

Related News

Supreme Court expresses deep anger over dog attacks on Delhi streets

42% Backward Class Quota : తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ కు భారీ దెబ్బ

42% Backward Class Quota : ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా రాష్ట్ర ప్రభుత్వ పిటిషన్‌ను కొట్టివేయడంతో, హైకోర్టు ఆదేశాలు చెల్లుబాటుగా మిగిలాయి. ఇది తెలంగాణ ప్రభుత్వానికి రాజకీయంగా కూడా పెద్ద దెబ్బగా భావిస్తున్నారు

  • Supreme Court Bc Reservatio

    BC Reservation : తెలంగాణ సర్కార్ కు బిగ్ షాక్ ఇచ్చిన సుప్రీం కోర్ట్

  • Bihar Jdu

    Bihar : బిహార్ లో 57 మందితో JDU తొలిజాబితా

  • Cm Revanth Request

    CM Revanth : రేపు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి..ఈసారి ఎందుకంటే !!

Latest News

  • Weight Loss Tips: 15 రోజుల్లో పొట్ట ఉబ్బరం సమస్యను త‌గ్గించుకోండిలా!

  • Diwali: దీపావ‌ళి ఏ రోజు జ‌రుపుకోవాలి? లక్ష్మీ పూజ ఎలా చేయాలంటే?

  • Shreyas Iyer: హీరోయిన్‌తో శ్రేయ‌స్ అయ్య‌ర్ డేటింగ్‌.. వీడియో వైర‌ల్‌!

  • India Playing XI: రేపు ఆసీస్‌తో తొలి వ‌న్డే.. భార‌త్ తుది జ‌ట్టు ఇదేనా?

  • India- Russia: చైనాకు చెక్ పెట్టేందుకు సిద్ధ‌మైన భార‌త్‌- ర‌ష్యా?!

Trending News

    • Layoffs: ఉద్యోగాలు కోల్పోవ‌డానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కార‌ణ‌మా?!

    • RCB For Sale: ఆర్సీబీని కొనుగోలు చేయ‌నున్న అదానీ గ్రూప్‌?!

    • Diwali: దీపావ‌ళి రోజు ప‌టాకులు కాల్చుతున్నారా? అయితే ఈ వార్త మీకోస‌మే!

    • Gold Prices: 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 1.35 ల‌క్ష‌లు?!

    • Tamil Nadu : హిందీ హోర్డింగులు, సినిమాలు, పాటలు బ్యాన్.. డీఎంకే “భాషా” సెంటిమెంట్‌

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd